English   

బాలీవుడ్ లో ప్రేమకు వేళాయెరా..!

ranveer singh deepika padukone
2018-03-01 13:39:09

ఒక‌ప్పుడు సినిమా వాళ్ల ప్రేమ‌లంటే నీటిమీద రాత‌ల్లా ఉండేవి. అవి ఎక్కువ కాలం నిల‌బ‌డేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు. సిమెంట్ పై రాత‌ల్లా మారిపోయాయి. ఒక్క‌సారి క‌మిటైతే వాళ్ల మాట వాళ్లే విన‌డం లేదు. ఒక్కొక్క‌రుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రేమించిన త‌ర్వాత క‌చ్చితంగా దాన్ని పెళ్లితోనే ముగించాల‌ని ఫిక్స్ అయిపోయారు. ఈ మధ్య చాలా మంది సెలెబ్రెటీస్ త‌మ ప్రేమ‌ను పెళ్లితోనే ముగించారు. మూడేళ్ళ ప్రేమ అనంతరం ఈ మ‌ధ్యే ఒక్క‌ట‌య్యారు అనుష్క శర్మ -విరాట్‌ కోహ్లి. ఇప్పుడు లైన్ లో దీపికా పదుకొణే - రణవీర్‌ సింగ్ కూడా ఉన్నారు. వీళ్ల ప్రేమ ఇంకా ప్ర‌పంచానికి వీళ్లై వీళ్లు చెప్ప‌లేదు కానీ వీళ్ళ చేత‌లు మాత్రం క‌చ్చితంగా ప్రేమికులే అని చూపిస్తున్నాయి.

ఇక శ్రీ‌దేవి పుణ్య‌మా అని ఇప్పుడు సోన‌మ్ క‌పూర్ ప్రేమ కూడా బ‌య‌టికి వ‌చ్చింది. కొన్ని రోజులుగా ఈమె ఆనంద్‌ అహూజాతో ప్రేమ‌లో ఉంది. కానీ దీన్ని ఎప్పుడూ బ‌య‌ట పెట్ట‌లేదు. ఇప్పుడు శ్రీ‌దేవి అంత్య‌క్రియల‌కు ఆనంద్ తో క‌లిసి వ‌చ్చింది సోన‌మ్. వాళ్ల‌కు తోడు రాజ్ కూమార్‌ రావు- పత్రలేఖ.. ఇలియానా -ఆండ్రూ నీబోన్‌ జంటలు పెళ్లికి సిద్ధంగా వున్నాయి. ఇలియానా అయితే పెళ్లి చేసుకుంద‌నే వార్త‌లున్నాయి. ఇప్పుడు శ్రీ‌య కూడా ర‌ష్య‌న్ బాయ్ ఫ్రెండ్ ఆండ్ర్యూను పెళ్లి చేసుకోబోతుంది. హీరో వరుణ్‌ ధావన్ కూడా త‌న ప్రేమ‌ను ప‌రిచ‌యం చేసాడు. ఈయ‌న కొంత కాలంగా నటాషా లాల్‌తో డేటింగ్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ జోడీ కూడా పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌లు బ‌లంగానే వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మ‌ధ్య ప్రేమ‌ల‌న్నీ పెళ్లితోనే ఎండ్ అవ్వ‌డం సంతోషం.

More Related Stories