English   

నటుడు చలాకి చంటికి కార్ యాక్సిడెంట్

chanti
2019-06-18 09:49:13

సినీ నటుల వరుస ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన యువ హీరోలు వరుసగా ప్రమాదాలకి గురవుతుండగా ఈరోజు ఆ ప్రమాదం బారిన ఒక ప్రముఖ నటుడు పడ్డాడు. ఆయన ఎవరో కాదుం జబరదస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొంది, భీమిలి కబడ్డీ జట్టు లాంటి ఎన్నో సినిమాలలో నటించి ఫేం సంపాదించిన చలాకీ చంటి. ఈ రోజు ఆయనకి తృటిలో పెను రోడ్డు ప్రమాదం తప్పింది. కోదాడ హైవేపై వెళ్తున్న ఆయన కారు (టీఎస్ 07 జీఎం 0060)  కొమరబండ వద్ద లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జబర్దస్త్‌ యాక్టర్‌ చలాకి చంటికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ ని గమనించి స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చంటిని ఆయనతో ఉన్న వారిని స్థానికంగా ఉన్న తిరుమల ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్‌ కి  వస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం ఆరున్నర గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గతంలో కూడా చంటి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.  ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

More Related Stories