English   

Jabardasth : జబర్దస్త్ లో రెచ్చిపోయిన ఆట జంట.. ఈ స్థాయిలోనా?

Jabardasth
2021-09-07 11:18:29

Jabardasth : జబర్దస్త్ ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ లు జీవనోపాధి పొందుతున్నరు. అంతేకాకుండా షో ద్వారా ఎంతోమంది కమెడియన్ లు వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇది తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల అవ్వగా ఇందులో ఆట సందీప్, అలాగే జ్యోతి లు స్టేజ్ పైన రెచ్చిపోయిన తీరు చూసి నేటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే బిగ్ బాస్ షో మొదలు కానంతవరకు ఆట సందీప్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ పేర్లు వినపడ్డాయి.

కానీ ఆదివారం బిగ్ బాస్ షో ప్రారంభం అవడంతో అది నిజం కాదని తెలిసిపోయింది.తాజాగా ప్రోమోలో ఆట సందీప్, జ్యోతి లు ముద్దులతో రెచ్చిపోయారు. ఇది చూసి జడ్జీలు మనో, రోజా ఆశ్చర్యపోయారు. జ్యోతి వెళ్ళిపోతుంటే జ్యోతి వద్ద ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు ఆట సందీప్. ఎందుకండీ ఏమైంది అంటూ జ్యోతి అమాయకంగా  అడుగుతుంది .

అందుకు స్పందించిన ఆట సందీప్ నువ్వు వెళ్ళిపోతే నా ఊపిరి ఆడదుగా అంటాడు. దీనితో రెచ్చిపోయిన జ్యోతి ఆట సందీప్ ని గట్టిగా హగ్ చేసుకొని బుగ్గపై ముద్దు పెట్టుకుంది. అంతేకాకుండా ఆ పై కన్ను కొడుతూ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.ఈ ప్రోమో చూసిన నెటిజన్లు బిగ్ బాస్ లో ఛాన్స్ మిస్ అయినందుకు జబర్దస్త్ లో ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నార అంటూ కామెంట్లు పెడుతున్నారు.

More Related Stories