English   

సైరాలో జ‌గ‌ప‌తి బాబు లుక్...వీరా రెడ్డి అదరకొట్టాడు!!

jagapathi-Babu
2019-02-12 11:36:43

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న భారీ చారిత్రాత్మ‌క సినిమా సైరా. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత కధను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు, న‌య‌న‌తార, త‌మ‌న్నా వంటి విల‌క్ష‌ణ‌ న‌టులు న‌టిస్తున్నారు. ఫ్యామిలీ హీరో అంటే వెంటనే గుర్తొచ్చే జగపతి బాబు లెజెండ్ సినిమా కోసం విలన్ గా మారి ఇది మరో పునర్జన్మలా విలనిజం పండిస్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా సినిమాలో న‌టిస్తున్న స్టార్స్ పుట్టిన రోజుని పున‌స్క‌రించుకొని వారికి సంబంధించిన పాత్ర‌ల‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ రోజు జగ‌ప‌తి బాబు కావ‌డంతో ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సైరాలో జ‌గ‌ప‌తి బాబు లుక్ విడుద‌ల చేశారు. వీరా రెడ్డి పాత్రలో నటిస్తున్న జ‌గ‌ప‌తిబాబు లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. భుజాల వరకూ జుట్టూ, బాగా పెరిగిన గడ్డం, మీసాలతో స‌రి కొత్త లుక్‌ లో కనిపిస్తున్నారు జగ్గూ భాయ్. ఇక ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కానుంది. సైరా చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌ పై నిర్మిస్తున్నారు. 

More Related Stories