English   

ఎవరూ ఊహించని బిజినెస్ లోకి జగపతి బాబు

Jagapathi Babu
2021-06-13 11:11:59

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్ పాత్రల్లో రాణిస్తున్నారు. అంతే కాకుండా జగ్గూ బాయ్ కి హీరోగా కంటే విలన్ గానే ఎక్కువ గుర్తింపు వచ్చింది. దాంతో ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారాడు. లెజెండ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా మరియు తండ్రి పాత్రల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. కొన్ని సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నారు. 

అయితే తాజాగా జగపతి బాబు చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల జగపతిబాబు ఆనందయ్య మందుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేదం ఎప్పుడూ హాని చేయదు అని. తాను నమ్ముతున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జగపతి బాబు హైదరాబాద్ లో ఓ ఆయుర్వేదం స్టోర్ ను ఓపెన్ చేస్తున్నారని గుసగుసలు వినిపస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఇలాంటి వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు నిజమా పుకార్లు మాత్రమేనా అన్నది తెలియాలంటే దీనిపై జగ్గు బాయ్ స్పందించాల్సి ఉంది.

More Related Stories