English   

నాకు క‌న్న‌డ వాళ్లు ఇచ్చిన రెస్పెక్ట్ తెలుగు వాళ్లు ఇవ్వ‌లేదు.. జ‌గ‌ప‌తిబాబు

Jagapati Babu
2021-02-27 18:17:20

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా అల‌రించిన జ‌గ‌ప‌తిబాబు ప్ర‌స్తుతం తండ్రి పాత్ర‌ల్లో మ‌రియు విల‌న్ పాత్ర‌ల్లో అద‌ర‌గొడుతున్నారు. తెలుగులో మాత్ర‌మే కాక ఇత‌ర భాష‌ల్లోనూ జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తూ అల‌రిస్తున్నాడు. ఈ నేప‌థ్యంనే జ‌గ‌ప‌తి బాబు క‌న్న‌డ‌లో రాబ‌ర్ట్ అనే సినిమాలో న‌టించాడు. ఈ సినిమాలో క‌న్న‌డ స్టార్ హీరో ద‌ర్శ‌న్ న‌టించారు. ఈ సినిమాను తెలుగులో డ‌బ్ చేస్తున్నారు. అయితే సినిమా ప్ర‌మోష‌న్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వ‌హించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో జగ‌ప‌తి బాబు ఆస‌క్తిక‌ర వ్యాక్య‌లు చేసారు. జ‌గ‌ప‌తి బాబు మాట్లాడుతూ..నేను ఈ మ‌ధ్య సినిమా ఈవెంట్స్ కు రావ‌డంలేదు. కానీ ఈ సినిమా ఈవెంట్ కు రావాలి అనే వ‌చ్చా. 

క‌న్న‌డ వాళ్ల గురించి చెప్ప‌డానికే వ‌చ్చా. సినిమాలో హీరోగా న‌టించిన ద‌ర్శ‌న్ కాళ్లు నేల‌పైనే ఉంటాయ‌ని ఇందాక ఎవ‌రో అన్నారు. ద‌ర్శ‌న్ కాళ్లు మాత్రమే కాదు. త‌ల కూడా నేల పైనే ఉంటుంది. అంత మంచి వాడు. కానీ ఆయ‌న మాత్రం ఎప్పుడూ ఆకాశంలో నే ఉంటాడు. ఇక ఈ సినిమా ద‌ర్శ‌కుడు త‌రున్ క‌థ చెప్ప‌గానే నాకు చాలా భ‌గా న‌చ్చింది.అప్పుడే సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంది అనుకున్నా. నేను గ‌తంలో క‌న్న‌డ సినిమాల్లో కూడా న‌టించాను. అప్పుడు క‌న్న‌డ వాళ్లు ఇచ్చిన రెస్పెక్ట్ తెలుగు వాళ్లు కూడా ఇవ్వ‌లేదు. న‌న్ను ఒక గెస్ట్ అని భాగా చూసుకోవాల‌ని చెప్పి చాలా భాగా చూసుకున్నారు. ఇప్పుడు వాళ్లు మ‌నద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు. మ‌న ప్రేమ‌ను చూపించాలి. అంటూ జ‌గ‌ప‌తి బాబు స్పీచ్ ఇచ్చారు. 

More Related Stories