English   

జై ల‌వ‌కుశ మ‌ళ్లీ విడుద‌ల‌..

Jai Lava Kusa to be release in malayalam
2018-06-09 03:20:25

అవును.. ఎన్టీఆర్ సినిమా మ‌ళ్లీ వ‌స్తుంది. ఇప్ప‌టికే టీవీల్లో కూడా వ‌చ్చిన జై ల‌వ‌కుశ ఇప్పుడు థియేట‌ర్స్ లో విడుద‌ల‌కు ముస్తాబవుతుంది. ఐతే అది మ‌న ద‌గ్గ‌ర కాదు.. మ‌ళ‌యాలంలో. అక్క‌డ ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు ఉంది. పైగా జ‌న‌తా గ్యారేజ్ లో మోహ‌న్ లాల్ తో క‌లిసి న‌టించాడు క‌దా దాంతో అక్క‌డ కూడా మార్కెట్ వ‌చ్చేసింది. ఆ సినిమా అక్క‌డ 5 కోట్ల వ‌రకు వ‌సూలు చేసింది. ఓ తెలుగు సినిమాకు అన్ని వ‌సూళ్లు అక్క‌డ అద్భుత‌మే. ఇక ఇప్పుడు ఇదే క్రేజ్ జై ల‌వ‌కుశకు ప‌నికొస్తుంది. ఈ చిత్రం కేర‌ళ‌లో భారీగానే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తాజాగా పోస్ట‌ర్లు కూడా రిలీజ్ చేసారు. రావ‌ణాసురం పేరుతో అక్క‌డ విడుద‌లవుతుంది జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం క‌చ్చితంగా మ‌ళ‌యాలంలో కూడా సినిమాను హిట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పైగా బాహుబ‌లి త‌ర్వాత తెలుగు సినిమాల‌పై మ‌ళ‌యాలంలో క్రేజ్ బాగానే పెరిగిపోయింది. చూడాలి మ‌రి.. అక్క‌డ జై ల‌వ‌కుశ ఎంత‌వ‌ర‌కు మాయ చేస్తుందో..? 

More Related Stories