English   

జంబ‌ల‌కిడిపంబ ఫ‌స్ట్ టాక్..!

Jamba-Lakidi-Pamba

పాత టైటిల్స్ తీసుకుంటుంటే ఇప్పుడు అభిమానులు బాధ ప‌డుతున్న అంశం ఇదే. ఎంద‌కుంటే ముందు వెన‌క చూడ‌కుండా టైటిల్ బాగుంది క‌దా అని అన్నింటినీ వాడేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ స్టాండ‌ర్డ్స్ చూస్తే మాత్రం ఆ రేంజ్ లో లేవు.. క‌నీసం స‌గం కూడా రావ‌ట్లేదు. ఇప్పుడు జంబ ల‌కిడి పంబ టైటిల్ ను కూడా వాడేసారు. క‌మెడియ‌న్ శ్రీ‌నివాస్ రెడ్డి హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఈ చిత్రం విడుద‌లైంది. టీజ‌ర్.. ట్రైల‌ర్ లో అంత‌గా కామెడీ అయితే క‌నిపించలేదు. మ‌రి ఇప్పుడు సినిమాలో అయినా ఆ రేంజ్ కామెడీ ఉంటుందా అనేది ఆస‌క్తిక‌ర‌మే. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం చూస్తుంటే జంబ ల‌కిడి పంబలో కామెడీ ఊహించ‌డం మాత్రం క‌ష్ట‌మే అని తెలుస్తుంది. మ‌రోసారి పాత టైటిల్ ను పాడు చేసార‌నే టాక్ బాగానే వినిపిస్తుంది. జంబ ల‌కిడి పంబ అన్న‌పుడు ప్రేక్ష‌కులు ఎంతో ఊహిస్తారు. ఎందుకంటే అప్ప‌ట్లో ఆ సినిమా సృష్టించిన సంచ‌ల‌నం అలాంటిది మ‌రి. ఇవివి కెరీర్ లోనే కాదు.. తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ సినిమాల్లో జంబ ల‌కిడి పంబ ఒక‌టి. జెండ‌ర్స్ మార్పుతో  వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కానీ ఇప్పుడు శ్రీ‌నివాస రెడ్డి గ్యాంగ్ ఆ మాయ చేయ‌డంలో విఫ‌ల‌మైంద‌నే టాక్ వినిపిస్తుంది. పైగా ఈ చిత్రం 2002లో హాలీవుడ్ లో వ‌చ్చిన ది హాట్ చిక్ అనే సినిమాకు ఫ్రీమేక్ అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ టాక్ తో సినిమా ఎంత‌వ‌ర‌కు నెట్టుకొస్తుందో..?

More Related Stories