English   

 జంబ ల‌కిడి పంబ‌.. పేరు చెడ‌గొట్ట‌రు క‌దా..!

Jamba-Lakidi-Pamba
2018-05-04 16:58:04

పాత టైటిల్స్ తీసుకుంటుంటే ఇప్పుడు అభిమానులు బాధ ప‌డుతున్న అంశం ఇదే. ఎంద‌కుంటే ముందు వెన‌క చూడ‌కుండా టైటిల్ బాగుంది క‌దా అని అన్నింటినీ వాడేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ స్టాండ‌ర్డ్స్ చూస్తే మాత్రం ఆ రేంజ్ లో లేవు.. క‌నీసం స‌గం కూడా రావ‌ట్లేదు. ఇప్పుడు జంబ ల‌కిడి పంబ టైటిల్ ను కూడా వాడేసారు. క‌మెడియ‌న్ శ్రీ‌నివాస్ రెడ్డి హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌కుడు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. నాని చేతుల మీదుగా విడుద‌లైన ఈ టీజ‌ర్ లో చెప్పుకోద‌గ్గ అంశాలైతే క‌నిపించ‌డం లేదు. జంబ ల‌కిడి పంబ అన్న‌పుడు ప్రేక్ష‌కులు ఎంతో ఊహిస్తారు. ఎందుకంటే అప్ప‌ట్లో ఆ సినిమా సృష్టించిన సంచ‌ల‌నం అలాంటిది మ‌రి. ఇవివి కెరీర్ లోనే కాదు.. తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ సినిమాల్లో జంబ ల‌కిడి పంబ ఒక‌టి. జెండ‌ర్స్ మార్పుతో  వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది.  ఇప్పుడు ఇదే క‌థ కాక‌పోయినా.. టైటిల్ తో వ‌స్తున్నాడు శ్రీ‌నివాస్ రెడ్డి. మ‌రి ఆ టైటిల్ పెట్టుకున్నందుకు అయినా న‌వ్విస్తాడేమో చూడాలిక‌..!

More Related Stories