English   

ఆ హీరో చావాల్సిందే...

Titanic - James Cameron

హీరోను చంపేంత కసి ఎవరికి ఉంటుందా అనుకుంటున్నారా..? ఇంకెవరికి ఆ సినిమాల మేకర్స్ కే. 1997వాల్డ్ మూవీ హిస్టరీలో ఓ ప్రకంపనం. సముద్రంలో నడిచిన ఆ కథ ప్రపంచ సినిమా నడకల్నే మార్చేసింది. లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులూ.. రాత్రికి రాత్రే ప్రపంచ వ్యాప్తంగా స్టార్స్ అయిపోయిన ఆ చిత్ర తారాగణం.. సినిమా ప్రపంచం అంతా అబ్బురపడిపోయి ఆ దర్శకుడి ప్రతిభను ఎంత జెలసీ ఉన్నా కొనియాడేసింది. అతనే జేమ్స్ కేమరూన్.. ఆ సినిమా టైటానిక్. ఓ సాధారణ ప్రేమకథను సముద్రంలో ఓ వాస్తవసంఘటన చుట్టూ నడిపించి జేమ్స్ చేసన మ్యాజిక్ కు ఫిదా కాని ఆడియన్ లేరు. ఆ దశాబ్ధాన్ని అత్యంత ప్రభావితం చేసిన సినిమాల్లో టైటానిక్ ఒకటి. అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ అనో లేక మళ్లీ రీ రిలీజ్ అనో హడావిడీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హీరో జాక్ మరణంపై కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ వినిపిస్తున్నాయి. 
నిజానికి టైటానిక్ కథ మన తోటారాముడుదే. కాకపోతే అందులోని హంగులు నేపథ్యమే దాన్ని ప్రపంచానికి అత్యంత చేరువ చేసింది. ధనవంతురాలైన అమ్మాయిని ప్రేమించే ఓ సాధారణ మాస్ హీరో. ఆఖరికి ఆపద వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయిని కాపాడతాడు హీరో. ఈ నేపథ్యంలో ఒక్క ప్రాణమే నిలవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రియురాలిని కాపాడి తను చనిపోతాడా హీరో. అప్పట్లో ఈ శాడ్ ఎండింగ్ ఎంతోమందిని కలచివేసింది. వాస్తవానికి జాక్, తన ప్రియురాలిని ఉంచిన చెక్కబల్లపై తనూ కూర్చుని ప్రాణాలు కాపాడుకునే చాన్స్ ఉంది. కానీ దర్శకుడు మాత్రం ఆ పాత్ర చనిపోవాల్సిందే అని డిసైడ్ అయ్యాడు. అందుకే ఆ హీరో చావాల్సిందే అనుకున్నాడు. ఇది చాలామందికి కథానుగుణంగా నచ్చకపోయినా కాసులు కురిపించిన ఎలిమెంట్స లో ఇదే మెయిన్.

అయితే ఈ సినిమా చేసిన వారిలో కూడా జాక్ పాత్ర చనిపోవడం పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హీరోయిన్ కేట్ విన్ స్లెట్ కు జాక్ చనిపోవడం ఇష్టం లేదు. అందులో విలన్ గా నటించిన బిల్లీ జేన్ కూడా ఆ పాత్ర చనిపోయింది కాబట్టే ఇంత హిట్ అయిందని చెబుతున్నాడు. అందరికంటే భిన్నంగా దర్శకుడు జేమ్స్ కేమరూన్ స్పందించాడు. ఆ పాత్ర చనిపోయి ఉండకపోతే నా సినిమా కూడా చనిపోయేదే అన్నాడు. అదీ మేటర్. ఏదేమైనా చరిత్ర సృష్టించిన సినిమాలకు సంబంధించిన ఏ వార్తైనా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ పెంచేదే..

More Related Stories