English   

జ‌మున‌కు ఝ‌ల‌క్ ఇచ్చిన సావిత్రి..

keerty suresh and jamuna

జమున‌.. ఈ పేరుతో తెలుగు వాళ్ల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఎందుకంటే కొన్ని ద‌శాబ్ధాలుగా తెలుగు ఇండ‌స్ట్రీలో ఉంది ఈ సీనియ‌ర్ న‌టి. 50 వ ద‌శ‌కంలోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. అప్ప‌ట్నుంచి వంద‌ల సినిమాల్లో న‌టించిన లెజెండ్ జ‌మున‌. సావిత్రితో అత్యంత స‌న్నిహితంగా ఉన్న హీరోయిన్ జ‌మున మాత్ర‌మే. ఇప్పుడు సావిత్రి బ‌యోపిక్ వ‌స్తుంది క‌దా.. దానిపై జ‌మున కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. దాంతో ఈ సినిమాలో న‌టిస్తున్న కీర్తిసురేష్ కు జ‌మున‌పై కోపం వ‌చ్చింది. అస‌లు కీర్తి సురేష్ కి సావిత్రి పాత్రలో నటించే అర్హత ఉందా అంటూ ప్ర‌శ్నించింది జ‌మున‌. అన్న‌పుడు ఇది పెద్ద‌గా వైర‌ల్ కాలేదు కానీ.. కీర్తిసురేష్ చెవిన ప‌డ్డ త‌ర్వాత మాత్రం బాగానే సెన్సేష‌న్ అయింది. ఈ విషయంపై స్పందించిన కీర్తి సురేష్.. సావిత్రి బయోపిక్‌లో నటించేందుకు తనకు అన్ని ర‌కాల అర్హతలు ఉన్నాయంటూ చెప్పింది. ఈ సినిమాలో నటించాలని దర్శకులు తనను సంప్రదించిన వెంటనే తానేమీ తొంద‌ర‌ప‌డ‌లేద‌ని.. సావిత్రి గురించి అన్ని విష‌యాలు తెలుసుకున్న త‌ర్వాతే ఒప్పుకున్నాన‌ని చెప్పింది కీర్తిసురేష్. ఆ మ‌హాన‌టి గురించి ఎన్నో పుస్తకాలు చదివానని.. ఆమె నటించిన చిత్రాలన్నింటిని చూసాన‌ని.. మేన‌రిజ‌మ్స్ కోసం సావిత్రి కుమార్తె చాముండేశ్వ‌రిని క‌లిసి చాలా విష‌యాలు తెలుసుకున్నాన‌ని.. ఆమె నటన గురించి తెలుసుకోవడమే కాక.. హావభావాలు పలికించేందుకు సావిత్రిని పూర్తిగా చ‌దివాన‌ని చెప్పింది కీర్తిసురేష్. అందుకే తానేమీ అల్లాట‌ప్పాగా ఈ చిత్రం ఒప్పుకోలేద‌ని ఓ ర‌కంగా జమున‌కు పెద్ద కౌంట‌రే ఇచ్చింది కీర్తిసురేష్. మార్చ్ 29న రావాల్సిన మ‌హాన‌టి విఎఫ్ఎక్స్ కార‌ణంగా కాస్త ఆల‌స్యం కానుంది.

More Related Stories