జనతా గ్యారేజ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా జనతా గ్యారేజ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
న్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీసిన కొరటాల ఆ హీరోతోనే మరో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారట. అంతే కాకుండా కొరటాల ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఎన్టీఆర్ కు కథను కూడా వినిపించారట. ఇక ఈ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఇదే గనక నిజమైతే మరోసారి జనతా గ్యారేజ్ లాంటి హిట్ పక్కా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎండిగ్ దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలోను నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ ను తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఆర్ఆర్ఆర్ తరవాత ఈ సినిమా పట్టాలేక్కే చాన్స్ లేదు.
మరోవైపు ఎన్టీఆర్ బుచ్చిబాబు తో ఓ సోర్ట్స్ డ్రామాకు ఓకే చెప్పాడని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇప్పుడు కొరటాల తోనూ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడని వార్తలు రావడంతో ఎన్టీఆర్ నెక్స్ట్ ఏ సినిమాలో నటిస్తారో అని ఫ్యాన్స్ కు ఆసక్తి పెరిగింది.