English   

 ఝాన్వీ అదుర్స్.. ధ‌డ‌క్ పాస్..!

Janhvi-Kapoor
2018-07-21 15:01:37

ఝాన్వీక‌పూర్.. ఝాన్వీక‌పూర్.. కొన్ని రోజులుగా బాలీవుడ్ లో ఈమె పేరు మార్మోగిపోతుంది. దానికి కార‌ణం శ్రీ‌దేవి కూతురు కావ‌డ‌మే. అమ్మ సూప‌ర్ స్టార్ కావ‌డంతో ఆటోమేటిక్ గా ఈమె ఎంట్రీపై కూడా అంచ‌నాలు అదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ధ‌డ‌క్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఎన్నో అంచ‌నాలు.. మ‌రెంతో ఆస‌క్తి మధ్య వ‌చ్చింది ఈ భామ. అతిలోక‌సుంద‌రి త‌న‌య అనే ఇమేజ్ తో వ‌చ్చిన ఝాన్వీ తొలి సినిమాతోనే న‌ట‌న‌లో పాస్ మార్కులు వేయించుకుంది. సినిమాలో పూర్తిగా త‌న షో త‌ప్ప మ‌రొక‌ర్ని క‌న‌బ‌డ‌కుండా చేసింది. మ‌రీ ముఖ్యంగా ఇషాన్ క‌ట్ట‌ర్ కూడా ఝాన్వీ ముందు తేలిపోయాడు. 

స్క్రిప్ట్ లో హీరోయిన్ కు ఎక్కువ‌గా రోల్ ఉండ‌టంతో పాటు ద‌ర్శ‌కుడు శ‌శాంక్ కూడా పూర్తిగా ఫోక‌స్ అంతా ఝాన్వీపైనే పెట్టేసాడు. ధ‌డ‌క్ ఫ‌స్టాఫ్ లో ఎంత చ‌లాకీత‌నం చూపించిందో.. సెకండాఫ్ లో ఇంట్లోంచి పారిపోయిన త‌ర్వాత అంతే మొండిత‌నంతో పాటు ధైర్యం కూడా చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. న‌టిగా త‌ను శ్రీ‌దేవికి నిజ‌మైన వార‌సురాలు అని నిరూపించింది ఝాన్వీక‌పూర్. కానీ ఈ భామ‌కు ఇప్పుడున్న బాధ‌ల్లా ఒక్క‌టే.. తొలి సినిమాను త‌ల్లి చూడ‌కుండానే వెళ్లిపోయిందే అని..!కర‌ణ్ జోహార్ తో క‌లిసి జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తానికి సైరాత్ చూసిన వాళ్ల‌కు ధ‌డ‌క్ కాస్త న‌చ్చ‌క‌పోవ‌చ్చు కానీ చూడ‌ని వాళ్ల‌కు మాత్రం ఈ చిత్రం బానే అల‌రిస్తుంది. 

More Related Stories