English   

ఎరుపులో అరిపించేసిన జాన్వీ కపూర్ అందాలు..

Janhvi Kapoor
2020-05-27 11:23:31

అటు అందం.. ఇటు అభినయం.. రెండింటితోనూ దూసుకుపోతుంది జాన్వీ కపూర్. తల్లి పేరు నిలబెడుతూ రచ్చ చేస్తుంది. హీరోయిన్ అన్న త‌ర్వాత న‌ట‌న ఎంత కామ‌నో.. ఫోటోషూట్ కూడా అంతే. ఏదో ఓ టైమ్ లో క‌చ్చితంగా ఫోటోషూట్ చేయాల్సిందే.. అందాల‌న్నీ ఆర బోయాల్సిందే. ఇప్పుడు ఝాన్వీక‌పూర్ కూడా ఇదే చేసింది. ధ‌డ‌క్ కు ముందే వోగ్ మ్యాగ‌జైన్ కోసం ఫుల్లుగా రెచ్చిపోయిన ఈ పాప‌.. ఇప్పుడు రెడ్ డ్రెస్ లో పిచ్చెక్కించింది. ధ‌డ‌క్ హిట్ కావ‌డంతో ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మ‌డు. అమ్మ లేద‌నే ఒక్క బాధ త‌ప్ప ఇప్పుడంతా ఝాన్వీకపూర్ కు బాగానే క‌లిసొస్తుంది. పైగా దక్షిణాది దర్శకులు కూడా ఈ భామపై కన్నేసారిప్పుడు. ఇదే టైమ్ లో క‌ర‌ణ్ జోహార్ కూడా బాలీవుడ్ లో ఝాన్వీకి మ‌రో రెండు సినిమాల ఆఫ‌ర్ ఇచ్చాడు. మరోవైపు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లోనే ఉంటుంది ఈ బ్యూటీ. ఈ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. గ్లామ‌ర్ షో లో త‌న‌కెలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని గ‌తంలో బికినీ సాక్షిగా చెప్పింది. దానికి తోడు ధ‌డ‌క్ లో న‌ట‌న‌తో చంపేసింది ఝాన్వీ. అందం ప్ల‌స్ అభిన‌యం.. చాలా రేర్ కాంబినేష‌న్. రెండూ ఉన్నాయి కాబ‌ట్టి ఇప్పుడు ఝాన్వీ కెరీర్ కూడా దూసుకుపోతుంది. ఈమె హాట్ ఫోటోషూట్ టాలీవుడ్ లోనూ చ‌ర్చ‌కు దారితీసింది. మొత్తానికి అమ్మడు రెచ్చిపోయిన తీరు చూస్తుంటే ఔరా అనకుండా ఉండలేరు. తెలుగు దర్శక నిర్మాతలు చాలా మంది జాన్వీ డేట్స్ కోసం చూస్తున్నారు కానీ కుదరడం లేదు. 

More Related Stories