English   

శ్రీదేవి కూతురుకు బంపర్ ఆఫర్ 

Janhvi-Kapoor
2018-08-09 19:40:05

ఫస్ట్ మూవీ ధడక్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన బ్యూటీ ఝాన్వీ కపూర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కూడా అయింది. దీంతో శ్రీదేవి కూతురుగా ఆమె స్థానాన్ని భర్తీ చేయగల అందం, ప్రతిభ పుష్కలంగా ఉన్నాయనే పేరు కూడా ధడక్ తో తెచ్చుకుంది. ఈ క్రమంలో ఝాన్వీ కోసం ఎంతోమంది బడా ప్రొడ్యూసర్స అండ్ డైరెక్టర్స్ కర్చీఫ్ లు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు సౌత్ లో కూడా ఝాన్వీ కోసం రాయబారాలు మొదలయ్యాయి. అయితే ఝాన్వీ అండ్ టీమ్ మాత్రం ఆచితూచి స్క్రిప్టులు వేస్తున్నారు. అందుకే అంత త్వరగా ఎవరికీన కనెక్ట్ కాలేదు. కమిట్ కాలేదు. బట్.. లేటెస్ట్ గా అమ్మడికి ఓ భారీ ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చింది. దీనికి తనను హీరోయిన్ గా పరిచయం చేసిన కరణ్ జోహార్ నిర్మాత కావడంతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో వెంటనే యస్ చెప్పిందీ బ్యూటీ.. 

ఝాన్వీ కపూర్ రెండో సినిమా కన్ఫార్మ్ అయింది. అది కూడా ఓ భారీ మల్టీస్టారర్. రణ్ వీర్ సింగ్, కరీనా కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, భూమీ ఫెడ్నేకర్ తో పాటు తన బాబాయ్ అనిల్ కపూర్ కూడా నటిస్తోన్న ఈ సినిమాలో ఝాన్వీ నటిస్తోంది. ఈ మేరకు ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఇంతకీ సినిమా పేరేంటో తెలుసా.. ‘తక్త్’. సో ఈ భారీ ప్రాజెక్ట్ లో ఝాన్వీ నటిస్తోందని ప్రముఖ బాలీవుడ్ ఫిల్మీ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ చేశాడు.  మొత్తంగా ఝాన్వీ కోసం ఎదురుచూస్తోన్నవాళ్లందరికీ ఇది బ్యాడ్ న్యూసే. ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోబోతోన్న ఈ మూవీ 2020లో విడుదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. 

More Related Stories