English   

ఝాన్వీ ఫ‌స్ట్ ఎక్స్ పీరియ‌న్స్ అయిపోయింది..!

janshi first experience
2018-05-30 13:27:08

అవును.. మీరు చూసింది క‌రెక్టే.. ఝ‌న్వీక‌పూర్ ఫ‌స్ట్ ఎక్స్ పీరియ‌న్స్ అయిపోయింది.. ఎందులో అబ్బా అని ఊహ‌లొద్దు. ఆమె ఫోటోషూట్ విష‌యంలో మేం చెబుతున్న‌ది. ఇన్నాళ్లూ సినిమా బిజీతో ఉన్న ఝాన్వీ ఇప్పుడు త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకునే ప‌నిలో ప‌డింది. ఇన్నాళ్ళూ అంటే అమ్మ ఉండేది కానీ ఇప్పుడు లేదుగా..! అందుకే నాన్న తోడుగా అన్నీ తానే చ‌క్క‌బెట్టుకుంటుంది జూనియ‌ర్ శ్రీ‌దేవి. తాజాగా ధ‌డక్ షూటింగ్ పూర్తి కావ‌డంతో ఆ చిత్ర ప్ర‌మోష‌న్స్ చేసుకుంటూనే.. ఫోటోషూట్స్ కూడా సై అంటుంది. త‌న కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ ఓ హాట్ ఫోటోషూట్ చేసింది ఈ భామ‌. వోగ్ మ్యాగ‌జైన్ కోసం క‌ళ్లుచెదిరేలా ఫోటోషూట్ చేసింది ఝాన్వీ క‌పూర్. అప్ప‌ట్లో ఈ భామ అస‌లు అతిలోక‌సుంద‌రికి వార‌సురాలు అయ్యే అవ‌క‌శాలున్నాయా అని టాక్ వ‌చ్చింది.. కానీ ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన త‌ర్వాత బాలీవుడ్ కు మ‌రో స్టార్ హీరోయిన్ ఆన్ ది వే అనిపిస్తుంది. అంత‌గా రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌ట్నుంచీ త‌న హొయ‌ల‌న్నీ బాలీవుడ్ కు అంకితం చేసేలా క‌నిపిస్తుంది ఝాన్వీ. ఈమె న‌టించిన ధ‌డ‌క్ జూన్ లోనే విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. కూతురు స్టార్ కావాల‌ని క‌ల‌లు క‌న్న శ్రీ‌దేవి కోరిక‌ను ఝాన్వీ ఎంత‌వ‌ర‌కు తీరుస్తుందో..? 

More Related Stories