English   

 శ్రీ‌దేవి రుణం ఝాన్వీతో తీరుస్తాడా..? 

janhvi
2018-07-26 08:27:24

వారం రోజుల కింది వ‌ర‌కు ఝాన్వీక‌పూర్ అంటే కేరాఫ్ శ్రీ‌దేవి. కానీ ఇప్పుడు సొంతంగా త‌నకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. ఎందుకంటే ధ‌డ‌క్ సినిమాలో న‌ట‌న‌తో అంత‌గా అద‌ర‌గొట్టింది ఈ బ్యూటీ. నిజానికి ధ‌డ‌క్ విడుద‌ల‌కు ముందే బాలీవుడ్ లో ఝాన్వీ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయిపోయింది. ఇక విడుద‌లైన త‌ర్వాత ఈ భామ గురించే ఇండ‌స్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. శ్రీ‌దేవి కూతురు కావ‌డం ఓ కార‌ణం అయితే.. ధ‌డ‌క్ లో ఈమె న‌ట‌న మ‌రో కార‌ణం. తొలి సినిమాలోనే గ్లామ‌ర్ కాకుండా అభిన‌యంతో ఆక‌ట్టుకునే స‌రికి ఈమె కోసం ద‌ర్శ‌కులు క్యూ క‌డుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రాజ‌మౌళి చూపు కూడా ఝాన్వీపై ప‌డింద‌ని తెలుస్తుంది. 

మ‌రోవైపు బాలీవుడ్ లోనూ ఝాన్వీకి అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. క‌ర‌ణ్ జోహార్ అయితే త‌న త‌ర్వాతి రెండు సినిమాల్లోనూ ఝాన్వీకి ఆఫ‌ర్ ఇచ్చాడు. ఇప్పుడు రాజ‌మౌళి నుంచి కూడా ఝాన్వీకి అవ‌కాశం వెళ్లింద‌ని వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. దీనికి కూడా కార‌ణం లేక‌పోలేదు. బాహుబ‌లిలో శివ‌గామి పాత్ర కోసం ముందు శ్రీ‌దేవినే తీసుకున్నాడు రాజ‌మౌళి. కానీ అప్పుడు అనుకోని కార‌ణాల‌తో ఆ పాత్ర ర‌మ్య‌కృష్ణ‌కు వెళ్లింది. అయితే అప్పుడు అమ్మ‌తో మిస్ అయిన అవ‌కాశాన్ని కూతురుకు ఇచ్చి ఆ రుణం తీర్చుకోవాల‌ని చూస్తున్నాడు రాజ‌మౌళి. ఎన్టీఆర్-చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ లో ఈమెకు ఛాన్స్ ఇస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం కోసం ఏకంగా 100 రోజుల బ‌ల్క్ డేట్స్ ఇచ్చింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే కానీ నిజ‌మైతే ఝాన్వీ రేంజ్ మారిపోవ‌డం ఖాయం.

More Related Stories