English   

సంజన గణేశన్‌‌ని పెళ్లి చేసుకున్న క్రికెటర్ బుమ్రా 

 Jasprit Bumrah
2021-03-15 18:51:21

గ‌త కొన్ని రోజులుగా బుమ్రా, సంజ‌న పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు  సోష‌ల్ మీడియా ట్రెండింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే.   ఆ వార్తలను నిజం చేస్తూ మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్‌  ప్రజెంటర్‌ సంజన గణేశన్‌‌ని ఈరోజు గోవాలో బుమ్రా వివాహం చేసుకున్నాడు.  ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది.  ' మా జీవితంలోనే అత్యంత ఆనందకరమైన రోజు.  మా పెళ్లి వార్తను, ఆనందాన్ని  మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం'  అంటూ బుమ్రా ట్వీట్‌ చేశాడు. దీంతో భారత క్రికెటర్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. బీసీసీఐ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మాజీ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌, వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ అందరూ బుమ్రా దంపతులకు అభినందనలు తెలిపారు.

More Related Stories