English   

జాతిరత్నాలు ట్రైలర్ టాక్

Jathi Ratnalu Official Trailer
2021-03-04 17:59:02

టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా జాతి రత్నాలు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. అంతే కాకుండా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సినిమాలో నవీన్ పొలిశెట్టి కి ఫ్రెండ్స్ గా రాహుల్ రామకృష్ణ, ప్రియ దర్శి కీలక పాత్రల్లో నటించారు. అంతే కాకుండా హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటించింది. ఇక ఇప్పటికే సినిమా నుండి విడుదల చేసిన "చిట్టి నా బుల్ బుల్ చిట్టి" సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. 

అంతే కాకుండా సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆధ్యంతం ట్రైలర్ వినోదభరితంగా ఉంది. ట్రైలర్ లో రాహుల్, ప్రియ దర్శి, నవీన్ పొలిశెట్టి మధ్య కామెడీ సన్నివేశాలు అలరించాయి. ట్రైలర్ లో హీరోయిన్ మరియు హీరో మధ్య ఉన్న సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దాంతో ఈ ట్రైలర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది.

More Related Stories