English   

సన్ ఆఫ్ ఇండియా నుండి లిరికల్ సాంగ్ రిలీజ్

mohan babu
2021-06-15 13:24:49

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'సన్ ఆఫ్ ఇండియా' ఈ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా టీజర్ కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో మెగాఫ్యామిలీ అభిమానులు కూడా సినిమాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక లిరికల్ సాంగ్ వీడియో ను చిత్ర యూనిట్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసింది. 

ఈ లిరికల్ వీడియో "జయ జయ మహావీర్... అంటూ ప్రారంభం అయ్యింది. ఈ పాటను రాహుల్ నంబియార్ పాడారు. అంతే కాకుండా ఈ పాటకు మాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం ఈ సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఇళయరాజా గారు తెలుగులో చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ పాటకు స్వరాలు అందించడం తో ఈ చిత్రం పాటల కూడా అంచనాలు ఉన్నాయి.

More Related Stories