English   

అమ్మ ఆస్తిపై కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం..

jaya
2020-05-22 20:19:35

జయలలిత.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఓ రాష్ట్రానికే అమ్మ.. అందరి బాధలు అర్థం చేసుకున్న అమ్మ. కానీ చివరికి తన బాధను మాత్రం అర్థం చేసుకోడానికి ఎవ్వరూ లేకుండా పోయారు. చివరి రోజుల్లో ఈమె నరకం చూసిందని కొన్ని తమిళ పత్రికలు కూడా రాసాయి. ఇక వేల కోట్లకు అధిపతి అయిన జయలలిత.. చివరికి ఏం లేకుండానే పోయింది. ఈమె కోట్లాది రూపాయల ఆస్తి ఎవరికి ఇవ్వాలనేది ఇప్పటికీ రచ్చ జరుగుతూనే ఉంది. తిరుగులేని నేతగా ఉన్న ఆమె.. ఉన్నట్లుండి అనారోగ్యానికి గురి కావటం.. 70 రోజుల పాటు అజ్ఞాతంలో ఉండటం.. ఎప్పుడు అడిగినా కూడా అమ్మ బాగానే ఉందని చెప్పి చివరికి ఆమె శవాన్ని బయటికి తీసుకొచ్చారు. దీనిపై అప్పట్లో చాలా దుమారమే రేగింది. అపోలో ఆసుపత్రిపై కూడా విమర్శలు చాలానే వచ్చాయి. ఆమె ట్రీట్ మెంట్ మీద సందేహాలు.. అసలు ఏం జరిగిందనే విషయంపై తెలియని సంగిగ్ధం.. ఎన్నో ఆరోపణలు ఇలా ఎన్నో అమ్మ చావు చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమ్మకు అత్యంత ప్రాణపదమైన పోయెస్ గార్డెన్ ను మ్యూజియంగా మార్చాలని కొంతకాలం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఈ మేరకు తాజాగా అమ్మ ఉన్న ఈ ఇంటిని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఆర్డినెన్స్ ను జారీ చేయటం ఆసక్తికరంగా మారింది. పోయెస్ గార్డెన్ ను సొంతం చేసుకోవటానికి వారసుల మధ్య చట్ట పరమైన పరిష్కారం కుదరకపోవడంతో ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్స్ జారీ అయ్యింది. దాంతో అమ్మ భవనం ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్నమాట. దీనికి తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోమిత్ సైతం ఓకే చెప్పేసాడు. పోయెస్ గార్డెన్ నిర్వహణను ముఖ్యమంత్రి నేతృత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి.. సమాచారా శాఖ మంత్రి.. సమాచార శాఖ కార్యదర్శి ధర్మకర్తలుగా ట్రస్టును ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్డినెన్సు ను జారీ చేశారు. తన జీవితంలో అంత కష్టపడి కట్టుకున్న భవంతి తన వాళ్లకు కాకుండా ప్రభుత్వానికి వెళ్లిపోతుందని అమ్మ బతికున్నపుడు కనీసం కలలో కూడా అనుకుని ఉండదేమో..? ఇదే జీవితం అంటే మరి.

More Related Stories