English   

చంద్రబాబును కలిసిన జయసుధ...అందుకే

cbn
2020-02-18 06:51:05

వైఎస్సార్సీపీ నేత, సినీ నటి జయసుధ మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆమె తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించినట్టుగా చెబుతున్నారు. జయసుధ వెంట ఆమె సోదరి, నటి సుభాషిణి కూడా బాబు నివాసానికి వెళ్లారు. జయసుధకు నిహార్ కపూర్, శ్రీయాన్ కపూర్ అని ఇద్దరు కుమారులున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న నిహార్ కపూర్ ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్‌ను వివాహం చేసుకోనున్నారని చెబుతున్నారు. ఇక జయసుధ భర్త నితిన్ కపూర్ 2017లో సూసైడ్ చేసుకుని చనిపోయారు. 2009లో జయసుధ రాజకీయాల్లోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత పరిస్థితుల్లో అనంతరం టీడీపీలో చేరారు. తెలుగుదేశంలో చేరినా ఆమె రాజకీయాల్లో యాక్టివ్ కాలేదు. ఇక గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు.

 

More Related Stories