English   

జీవిత ప్ర‌శ్న‌ల‌కు శ్రీ‌రెడ్డి స‌మాధాన‌మేంటి..? 

Jeevitha-Rajasekhar

ఓ నెల రోజుల నుంచి ఎక్క‌డ చూసినా శ్రీ‌రెడ్డి శ్రీ‌రెడ్డి అంటూ సావ‌గొడుతున్నారు ప్రేక్ష‌కుల్ని. కొన్ని మీడియా ఛానెల్స్ త‌మ ప‌రువును కూడా గాలికి వ‌దిలేసి.. ఈమె చెప్పే ప‌రుపు క‌థ‌ల‌కు వంత పాడుతున్నారు. అది మ‌న ద‌రిద్రం దానికి ఏం చేయ‌లేం కానీ ఇప్పుడు జీవిత మాత్రం కొంద‌రిని సూటి ప్ర‌శ్న‌లు కొన్ని అడిగింది. ఇన్నాళ్లూ తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశాలు రావ‌ట్లేద‌ని పోరాటం చేస్తోన్న శ్రీ‌రెడ్డి దీనికి ఏ స‌మాధానం చెబుతుందో చూడాలి మ‌రి..? ప‌్ర‌తీ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అక్క‌డ దానికి వేరే పేరు ఉండొచ్చు. అలాగే సినిమా ఇండ‌స్ట్రీలోనూ ఉంది.. కానీ అంతా చెడ్డోళ్లు మాత్రం కాద‌ని చెప్పింది జీవిత‌. ఇక ఇలా క్యాస్టింగ్ కౌచ్ అంటూ రోడ్డెక్కిన వాళ్ల‌ను జీవిత అడిగిన ప్ర‌శ్న‌లివే. ఇండ‌స్ట్రీకి వ‌స్తున్న‌పుడే వాళ్ల‌కు తెలుసు క‌దా ఇక్క‌డ ఇలాంటివి ఉంటాయ‌ని..? పోనీ తెలియ‌దేమో అనుకుందాం.. వ‌చ్చిన త‌ర్వాత ఒక్క‌సారి మోస‌పోతాం.. రెండుసార్లు మోస‌పోతాం.. మ‌రి ప‌దేళ్లుగా ఎలా మోస‌పోతాం..? అంటే మీకు ఇష్టం ఉండే ప‌డుకోడానికి వెళ్లారా..? అక్క‌డ ప‌డుకోమంటార‌ని తెలిసి కూడా నువ్వు వెళ్లావంటే త‌ప్పు ఎవ‌రిది..?  ఇష్టం లేకుండా చేస్తే రేప్.. ఉండి చేసుకుంటే అది రేప్ కాదు. ఇప్పుడు కొంద‌రు ఇండ‌స్ట్రీలో రోడ్డెక్కి గ‌లాటా చేస్తున్న వాళ్లు అదే కేట‌గిరీలో ఉంటారు అన్న‌ట్లుగా ఇన్ డైరెక్ట్ సెటైర్లు వేసింది జీవిత. అంటే అవ‌కాశాల కోసం ప‌డుకుంటున్నాం అని తెలిసి కూడా పడుకుంటున్నారు కొంద‌రు. వాళ్ళేమైనా చిన్న‌పిల్ల‌లా..? ఒక్కొక్క‌రికి 30 ఏళ్లు వ‌చ్చాయి క‌దా ఆ మాత్రం తెలివి ఉండ‌దా మ‌రి..? అంటూ సీరియ‌స్ అయింది జీవిత‌. ఎవ‌రిష్టం వ‌చ్చిన‌ట్లు వాళ్లు సినిమా ఇండ‌స్ట్రీపై నోరు పారేసుకుంటుంటే ఎవ‌రు ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తుంది జీవిత‌. అవును.. నిజ‌మే క‌దా.. ఇప్పుడు శ్రీ‌రెడ్డి ఓ నిర్మాత కొడుకుతో య‌వ్వారం న‌డిపించింది. అది త‌న‌కు తెలిసే క‌దా న‌డిపింది..? అక్క‌డ ఇద్ద‌రి త‌ప్పు ఉంది. కానీ దొంగ ఏడుపు తీసుకొచ్చి త‌ప్పు ఇండ‌స్ట్రీ వైపు మ‌ళ్లిస్తున్నారు కొంద‌రు. మ‌రి ఇప్పుడు వీళ్ళంతా జీవిత అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌మ‌నండి..? ఎవ‌రూ ఇష్టం లేకుండానే వెళ్లి అవ‌కాశాల కోసం ప‌డుకున్నారేమో..? అన్నీ తెలిసే చేసి ఇప్పుడు మ‌ళ్లీ బ‌య‌టికి వ‌చ్చి నాట‌కాలు ఆడుతున్నారంటూ సీరియ‌స్ అయింది జీవిత‌. 

More Related Stories