English   

ఝాన్వీక‌పూర్.. అందాల "బ్లాక్"బ‌స్ట‌ర్..

jhanhvi-Kapoor
2018-09-22 21:00:07

ఝాన్వీక‌పూర్ ను చూస్తుంటే ఇప్పుడు ఇదే అనాల‌నిపిస్తుంది క‌దా. బ్లాక్ డ్ర‌స్ లో దేవ‌క‌న్య‌లా మాయ చేస్తుంది. న‌లుపులో చూపు తిప్పుకోనంత అందంగా న‌వ్వుతూ మ‌ది దోచేస్తుంది ఈ భామ‌. ధ‌డ‌క్ స‌క్సెస్ త‌ర్వాత ఝాన్వీ పేరు బాగా వినిపిస్తుంది బాలీవుడ్ లో. నెక్ట్స్ సినిమా వ‌చ్చే వ‌ర‌కు ఆ పేరు అలాగే విన‌బ‌డాలంటే ఎప్పుడూ అందాల ఆర‌బోత‌తో మెరుస్తూనే ఉండాలి. ఇది త‌ల్లి శ్రీ‌దేవి నేర్పిన సూత్రం. ఆమె లేక‌పోయినా ఆమె అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తుంది ఈ ముద్దుల కూతురు. త‌న సెల్ఫ్ ప్ర‌మోష‌న్ తో ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఎక్క‌డికి వ‌చ్చినా కూడా హాట్ గా అందాలు ఆర‌బోస్తూ అరాచ‌కాలు చేస్తుంది. శ్రీ‌దేవి ఉన్న‌పుడే న‌యం కాస్తైనా బ‌ట్ట‌ల సైజ్ పెంచుకుని వ‌చ్చేది. కానీ ఇప్పుడు ఝాన్వీ దూకుడు చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. తాజాగా మ‌రోసారి రెచ్చిపోయింది ఈ జూనియ‌ర్ శ్రీ‌దేవి. 

ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు ఎలా ద‌క్కించుకోవాలో శ్రీ‌దేవి కూతుళ్ల‌కు తెలియ‌దా..? ధ‌డ‌క్ విడుద‌ల త‌ర్వాత ఎక్కువ‌గా బ‌య‌టే క‌నిపిస్తుంది ఝాన్వీ. ఈ సినిమా తీసుకొచ్చిన ఇమేజ్ ను మ‌రింత క్యాష్ చేసుకునే ప‌నిలో బిజీగా ఉంది. అందుకే హాట్ హాట్ షోతో ఫ్యాష‌న్ వీక్ ల‌కు వ‌స్తుంది ఝాన్వీ. ఇప్పుడు కూడా ముంబైలో జ‌రిగిన ఓ ఈవెంట్ లో అలా హాట్ గా బ్లాక్ డ్ర‌స్ లో కోబ్రాలా కెమెరాల‌పైకి బుస‌లు కొట్టాయి జాన్వీ పరువాలు. అందాల ఆర‌బోత‌తో అక్క‌డున్న వాళ్ల‌కే కాకుండా అంద‌రికీ తీపిన‌రకం చూపించింది ఈ ముద్దుగుమ్మ‌. అమ్మ ఉన్న‌పుడు ఆమెతోనే ఉన్న‌వాళ్లు.. అవ‌కాశాలెలా తెచ్చుకోవాలో వాళ్ల‌కు తెలియ‌దా..? అందుకే ఎక్క‌డికి వ‌చ్చినా కెమెరా క‌ళ్లన్నీ త‌మ‌పైనే ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది శ్రీ‌దేవి పెద్ద కూతురు ఝాన్వీ. అస‌లు ఈమె అరాచ‌కం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఝాన్వీ దూకుడు ఊహించుకోవ‌డం కూడా క‌ష్టంగానే మారిపోతుంద‌బ్బా..!

More Related Stories