English   

దిల్ ధ‌డ‌క్.. ధ‌డ‌క్.. నిను చూస్తే..!

jhanvi kapoor new look
2018-06-08 08:10:49

ఇప్పుడు ఇదే అనాల‌నిపిస్తుంది శ్రీ‌దేవి కూతురు ఝాన్వీక‌పూర్ ను చూస్తుంటే. ఈమె న‌టిస్తున్న తొలి సినిమా ధ‌డ‌క్ కొత్త లుక్ విడుద‌లైంది. ఆ మ‌ధ్య విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. శ్రీ‌దేవి ఉన్న‌పుడే ఈ లుక్ వ‌చ్చింది. మ‌రాఠీలో సూప‌ర్ హిట్ అయిన సైరాత్ సినిమాకు రీమేక్ ఇది. శ‌శాంక్ కైథాన్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాతో ఇషాన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ లుక్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. త‌న కూతురు ఎంట్రీ ఎలా ఉండాలా అని రెండేళ్ల‌కు పైగా ఆలోచించి.. చివ‌రికి సైరాత్ రీమేక్ కు ఓకే చెప్పింది శ్రీ‌దేవి. పాపం ఇంత క‌ష్ట‌ప‌డి.. చివ‌రికి కూతురు తొలి సినిమా విడుద‌ల‌య్యే స‌మ‌యానికి లోకంలో లేకుండా పోయింది. అయితే ఎందుకో తెలియ‌దు కానీ ఝాన్వి తొలి సినిమాగా సైరాత్ సరైన సినిమా కాదేమో అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అస‌లు సైరాత్ లో అంత‌గా చెప్పుకోద‌గ్గ విష‌యం ఏమీ లేద‌ని.. ఆ టైమ్ లో మ‌రాఠీయుల‌కు ఆ సినిమా ఎందుకో క‌నెక్ట్ అయిపోయిందంతే.. హిందీలో సైరాత్ క్లిక్ అవ్వ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. మ‌రి చూడాలిక‌.. శ్రీ‌దేవి మాదిరిగానే తొలి చిత్రంతో జాన్వి కూడా అద‌ర‌గొడుతుందో లేదో..? ఈ చిత్రం జులై 20న విడుద‌ల కానుంది. 

More Related Stories