English   

ఝాన్వీపై క‌న్నేసిన కాంట్ర‌వ‌ర్సీ హీరో.. 

Jhanvi-Kapoor
2018-07-11 09:54:32

తొలి సినిమా విడుద‌ల కాక‌ముందే బాలీవుడ్ లో ఝాన్వీక‌పూర్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయిపోయింది. ఈ భామ గురించే ఇండ‌స్ట్రీ అంతా మాట్లాడు కుంటుంది ఇప్పుడు. శ్రీ‌దేవి కూతురు కావ‌డం ఓ కార‌ణం అయితే.. ధ‌డ‌క్ లో ఈమె అందాలు మ‌రో కార‌ణం. తొలి సినిమాలోనే త‌న గ్లామ‌ర్ తో మ‌తి చెడ‌గొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. శ‌శాంత్ కైతాన్ తెర‌కెక్కించిన ఈ చిత్రం జులై 20న విడుద‌ల కానుంది. ధ‌డ‌క్ విడుద‌ల‌కు ముందే బాలీవుడ్ లోను ఝాన్వీకి అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. క‌ర‌ణ్ జోహార్ అయితే త‌న త‌ర్వాతి రెండు సినిమాల్లోనూ ఝాన్వీకి ఆఫ‌ర్ ఇచ్చాడు. మ‌ర‌వైపు సౌత్ నుంచి కూడా ఈ భామ‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. తాజాగా కాంట్ర‌వ‌ర్సీ కింగ్ శింబు క‌న్ను ఝాన్వీపై ప‌డింద‌ని తెలుస్తుంది. వెంక‌ట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వం లో ఈయ‌న న‌టించ‌బోయే మానాడు సినిమాలో ఝాన్వీని తీసుకుంటే ఎలా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నాడు ఈ హీరో. ఇది పొలిటిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. ఈ చిత్రంలో ముందు కీర్తిసురేష్ ను హీరోయిన్ గా అనుకున్నా కూడా ఎందుకో కానీ ఆమె ఈ చిత్రంపై ఆస‌క్తి చూపించ‌డం లేదు. దాంతో ఝాన్వీని అడుగుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్ర‌స్తుతం ధ‌డ‌క్ ప‌నుల్లో బిజీగా ఉన్న ఝాన్వీ.. శింబు ఆఫ‌ర్ కు ఓకే చెబుతుందో లేదో చూడాలి..!

More Related Stories