English   

జిగేల్ రాణి సంపేసిందంతే.. 

Jigelu-Rani
2018-03-27 16:43:53

జిగేల్ రాణి జిల్ మనిపించింది. అదిరిపోయే సొగసులతో పాటు అద్దరగొట్టే స్టెప్పులతో రామ్ చరణ్ బర్త్ డే కానుకగా విడుదలైన రంగస్థలం ఐటమ్ సాంగ్ అద్దిరిపోయిందంతే. ఊరవీర మాస్ సాంగ్ గా కనిపిస్తోన్న ఈ పాటలో చరణ్ ఎనర్జీ లెవెల్స్ సూపర్. ఇక ఫస్ట్ టైమ్ ఐటమ్ సాంగ్ చేసిన పూజా హెగ్డే సోయగాలు, చూపులతో సంపేసిందంతే. ఇప్పటి వరకూ సుకుమార్ సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కు భిన్నంగా వెరీ మాసివ్ గా ఉందీ పాట. యూత్ తో పాటు అన్ని వర్గాలకు విపరీతంగా కనెక్ట్ అయ్యే మ్యాజిక్ ఏదో ఈ పాటలో కనిపిస్తోంది. 

చరణ్ లుంగీలో భలే ఉన్నాడు. సినిమా అంతా ఇదే గెటప్ లో ఉంటానని చెప్పినా.. ఈ లుంగీతో అంత పవర్ ఫుల్ డ్యాన్స్ లు వేయడం.. అది కూడా చాలా స్పీడ్ గా ఉన్న మూమెంట్స్ అవి.. కష్టం. అయినా ఇరగదీశాడు చరణ్. చరణ్ అంటే ప్రాణం అని చెప్పే జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. మాస్ బీట్ లో మనం ఇప్పటి వరకూ చూసిన స్టెప్పులకూ కాస్త భిన్నంగానే కనిపిస్తున్నాయీ మూమెంట్స్. ఏ మాటకామాటే.. ఈ పాటలో చరణ్ చూస్తే ముఠామేస్త్రీలో చిరంజీవి గుర్తొస్తున్నాడు. అప్పుడు చిరు కూడా లుంగీ, నిక్కరుతో మాస్ ను ఉర్రూతలూపాడు. ఇప్పుడు చరణ్ కూడా అదే చేయబోతున్నాడని ఈ సాంగ్ చూస్తేనే తెలుస్తోంది.  మొత్తంగా రంగస్థలంతో రామ్ చరణ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేలానే ఉన్నాడు. 

More Related Stories