English   

అరవింద సమేతకు బిగ్ షాక్

Aravinda-Sametha
2018-08-10 16:33:37

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న అరవింద సమేత వీరరాఘవకు బిగ్గెస్ట్ షాక్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మూవీని లీకు వీరుల నుంచి కాపాడలేకపోతున్నారు. ఇప్పటికే ఓ ఇంపార్టెంట్ సీన్ కు సంబంధించిన స్టిల్ లీక్ అయింది. అప్పట్లో ఈ విషయం పై చాలా సీరియస్ అయిన దర్శకుడు.. తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా మరోసారి అదే సీన్ కు సంబంధించిన స్టిల్స్ లీక్ అయ్యాయి. దీంతో ఎంటైర్ టీమ్ మళ్లీ షాక్ అయిందిట. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే..  అప్పుడు షూటింగ్ టైమ్ లో లీక్ అయిన పిక్స్ ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ నుంచి లీక్అయినట్టు తెలుస్తోంది..  ఈ సినిమాలో నాగబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాలో ఆయన చనిపోతాడని ముందే తెలిసేలా చేసిందీ లీక్ స్టిల్లే. యస్. ఈ స్టిల్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం కనిపిస్తుందని కూడా ముందే తెలిసేలా చేసిందీ లీక్ స్టిల్. ఇప్పుడా సీన్ కు కొనసాగింపుగా మరికొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. ఈ లీక్స్ ను చూస్తే ఇవేవో ఎడిటింగ్ టేబుల్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఆ టీమ్ మరోసారి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.  ఇక అక్టోబర్ 11న విడుదల కాబోతోన్న అరవింద సమేతలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ టీజర్ ను ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేయబోతున్నారు. 

More Related Stories