English   

ఆ ఎమ్మెల్యేకు ఎన్టీఆర్ ప్ర‌చారం.. 

Jr-NTR-MLA
2018-03-14 07:29:17

అదేంటి.. ఇప్పుడు రాజ‌కీయాల‌కు ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు క‌దా.. పైగా ఎన్నిక‌ల ప్ర‌చారం లాంటివి అస్స‌లు చేయ‌న‌ని ముందే చెప్పాడు క‌దా.. మ‌ళ్లీ ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యేకు ప్ర‌చారం చేస్తున్నాడు అనుకుంటున్నారా..? అయితే ఇక్క‌డున్న ఎమ్మెల్యే మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన వాడు కాబ‌ట్టి. ఆ ఎమ్మెల్యే మ‌రెవ‌రో కాదు ఎన్టీఆర్ అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ కాబ‌ట్టి. ఈయ‌న కొత్త సినిమా ఎమ్మెల్యే. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కు నంద‌మూరి చిన్నోడు కూడా రానున్నాడు. ఒక్కోసారి చెడు కూడా మ‌న‌కు మంచే చేస్తోంది. ఎన్టీఆర్ విష‌యంలో ఇది నిజ‌మే అయిందిప్పుడు. ఇంత‌కుముందు నంద‌మూరి కుటుంబంతో క‌లిసే ఉండేవాడు ఎన్టీఆర్. కానీ ఎక్క‌డ తేడా జ‌రిగిందో తెలియ‌దు గానీ బాల‌య్య బ్యాచ్ ఎన్టీఆర్ ను దూరం పెట్టింది. ఎంత‌లా అంటే బాలయ్య చిన్న‌కూతురు పెళ్లికి ఎన్టీఆర్ ను పిల‌వ‌ను కూడా లేదు. అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ తో మాత్రం ఎన్టీఆర్ సాన్నిహిత్యంగానే ఉండేవాడు. కానీ అది ఓ గీత వ‌ర‌కు ఉండేది. అలాంటి టైమ్ లోనే నంద‌మూరి జాన‌కిరామ్ యాక్సిడెంట్ లో క‌న్నుమూసారు. అప్ప‌టి వ‌ర‌కు క‌ళ్యాణ్ రామ్ కు అన్నీ అన్న‌య్యే. స‌డ‌న్ గా అన్న‌య్య మ‌ర‌ణం క‌ళ్యాణ్ రామ్ ను కుంగ‌దీసింది. 

జాన‌కిరామ్ మ‌ర‌ణం త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆ స్థానాన్ని భ‌ర్తీ చేస్తున్నాడిప్పుడు. క‌ళ్యాణ్ రామ్ కు అన్నీ త‌మ్ముడే ఇప్పుడు. మ‌రోవైపు త‌మ్ముడి కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధంగా ఉన్నాడు క‌ళ్యాణ్ రామ్. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ ఓ వైపు.. హ‌రికృష్ణ కుటుంబం మ‌రోవైపు అన్న‌ట్లు త‌యారైంది య‌వ్వారం. ఇలాంటి టైమ్ లో అన్నాద‌మ్ములిద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు అన్న‌ట్లు ఉన్నారు. ప‌ర్స‌న‌ల్ గా, ప్రొఫెష‌న‌ల్ గా ఎన్టీఆర్ కు అండ‌గా నిలుస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. ప్ర‌తీ విష‌యంలోనూ అన్న‌కు అండ‌గా నిలుస్తున్నాడు త‌మ్ముడు. మొన్న‌టికి మొన్న ఈ బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ క‌లిసి జై ల‌వ‌కుశ సినిమా చేసారు. అన్న‌య్య నిర్మాణంలో త‌మ్ముడు హీరోగా న‌టించాడు. ఇది ఓకే అనిపించింది. ఇక ఇప్పుడు అన్న క‌ళ్యాణ్ రామ్ సినిమాకు త‌మ్ముడు ప్ర‌చారం చేస్తున్నాడు. 

సినిమాల ప‌రంగానూ త‌మ్ముడి కెరీర్ కు త‌నే గైడ్ గా ఉన్నాడు. అన్నీ త‌న‌కు త‌మ్ముడే ప్రాణం అన్న‌ట్లుగా సిద్ధ‌మ‌య్యాడు క‌ళ్యాణ్ రామ్. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే సినిమా ఆడియో వేడుక‌కు ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు. అన్న‌య్య కోస‌మే అమెరికా నుంచి వ‌చ్చే సాడు ఎన్టీఆర్. క‌ర్నూల్ లో మార్చ్ 17న ఎమ్మెల్యే ఆడియో వేడుక జ‌ర‌గ‌నుంది. ఆ మ‌ధ్య ఓసారి అన్న‌య్య గురించి మాట్లాడుతూ త‌న‌కు నాన్న త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ నాన్న లాంటివాడంటూ బాగా ఎమోష‌న‌ల్ అయ్యాడు యంగ్ టైగ‌ర్. ఈ మాట‌తో అక్క‌డి వాళ్లంతా ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయిపోయారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఎంత బ‌లంగా ఉందో చెప్ప‌డానికి ఈ ఒక్క మాట చాలేమో..? మొత్తానికి ఒక అన్న‌య్య క‌న్నుమూసి.. ఈ బ్ర‌ద‌ర్స్ బంధానికి నాందీ వేసాడు. చావుతో క‌లిసిన బంధం క‌దా.. చ‌నిపోయేవ‌ర‌కు విడిచిపోయేలా లేదిప్పుడు..!

More Related Stories