English   

ఎన్టీఆర్ ఎంతో ఎదిగిపోయాడు

NTR-ipl
2018-03-27 17:03:11

ఎన్టీఆర్ ఎంత టాలెంటెడో కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక్కసారి అతనితో పనిచేస్తే మళ్లీ ఆ రిలేషన్ ఎవరూ వదులుకోరు అంటారు.అంటే తమ స్టార్ మా టివి రేటింగ్స్ ను తెలుగులో పెంచిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ మా వదులుకోవాలనుకోవడం లేదు. బిగ్ బాస్ -2 సీజన్ కు ఎన్టీఆర్ అందుబాటులో లేకపోయినా అతని క్రేజ్ తెలిసిన స్టార్ మా ఈ సారి మరింత రిచ్ గా యూజ్ చేసుకోబోతోంది. అది కూడా త్వరలో జరగబోతోన్న ఐపిఎల్ సీజన్ -11కోసం. 

అవును.. స్టార్ మా టివి ఈ సారి ఐపియల్ మ్యాచులకు తెలుగు కామెంటరీ ఇవ్వబోతోంది. ఇందుకోసం తమ ప్రోమోస్ ను, యాడ్స్ కు సంబంధించి ఓ క్రేజీ స్టార్ ఉంటే బావుండు అనుకుంది. అనుకున్న వెంటనే ఎన్టీఆర్ ను అప్రోచ్ అయింది. ఇంత పెద్ద బ్రాండ్ ను ఎవరు మాత్రం వదులుకుంటారు. పైగా దీనికి బిగ్ బాస్ లాగా ప్రతివారం రెండు రోజులు కేటాయించాల్సిన పనిలేదు. ఒక్కసారి షూట్ చేస్తే చాలు.. ఐపియల్ సీజన్ అయిపోయేంత వరకూ అవి ప్లే అవుతుంటాయి. అంతేకాక ఇప్పుడు షూటింగ్స్ కూడా లేవు ఎన్టీఆర్ కు. ఈ గ్యాప్ లో ఆ యాడ్స్, ప్రమోషన్స్ తో పాటు వేరే మార్కెటింగ్ మాటర్స్ అన్నీ కంప్లీట్ చేస్తాడు. 

ఇలాంటి ఆఫర్ రావడం చిన్న విషయమేం కాదు.  ఒక స్టార్ హీరోకెపాసిటీ అతనికి వచ్చే బ్రాండింగ్స్ ను బట్టి కూడా డిసైడ్ చేయొచ్చు. ఇన్నాళ్లూ ఈ విషయంలో కాస్త వీక్ గా ఉన్న తారక్.. ఒక్కసారిగా బిగ్గెస్ట్ బ్రాండ్ కు అంబాసిడర్ అయిపోయాడు. అన్నట్టు బిగ్ బాస్ కంటే ఈ క్రేజీ ఆఫర్ కే ఎన్టీఆర్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారని కూడా వినిపిస్తోంది. 

More Related Stories