English   

యంగ్ టైగర్ ను సెలెక్ట్ చేసుకున్నారు

jr.ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఈ మధ్య బాగా పెరుగుతోంది. బ్రాండింగ్స్ లోనూ విపరీతంగా దూసుకుపోతున్నాడు. అటు యాడ్స్ లోనూ అదరగొడుతున్నాడు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ లిస్ట్ లోకి మరో బ్రాండింగ్ వచ్చింది. ఆ బ్రాండింగ్ పేరు ‘సెలెక్ట్’. ఇది ఓ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్. ఇలా మొబైల్ రిటైల్ చైన్ కు గతంలో చాలామంది సినిమా వాళ్లు బ్రాండ్ అంబాసిడర్స్ గా చేశారు. రీసెంట్ గా రామ్ చరణ్ కూడా ఇలాంటి ఓ బిజినెస్ చైన్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు.

ఇప్పుడు ఎన్టీఆర్. సెలెక్ట్ పేరుతో సాగబోయే ఈ మల్టీబ్రాండ్ మొబైల్ చైన్ కు ఎన్టీఆర్ ను బ్రాండ్ అంబాసిర్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రేపు సాయంత్రం హైటెక్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అరవింద సమేత వీరరాఘవ అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి చేస్తాడు. ఏదేమైనా ఈ మధ్య ఎన్టీఆర్ రేంజ్ బాగా పెరిగింది. అందుకే ఈ బ్రాండ్ ఎన్టీఆర్ ను ‘సెలెక్ట్’ చేసుకుందనుకోవచ్చు. 

More Related Stories