English   

తెలంగాణ తెలుగుదేశం ఎన్టీఆర్ చేతుల్లోకి..!

Ntr TDP
2018-03-02 12:22:43

అవునా.. అలా జ‌రుగుతుందా.. అస‌లు త‌న‌కు రాజ‌కీయాలంటే ఇప్ప‌ట్లో ఇష్టం లేద‌ని.. త‌న దృష్టంతా ఇప్పుడు సినిమాల‌పైనే ఉంద‌ని చెప్పాడు క‌దా ఎన్టీఆర్ అనుకుంటున్నారా..? అవును.. ఇప్ప‌టికీ ఈయ‌న ఫోక‌స్ అంతా సినిమాల‌పైనే ఉంది. అయితే కార్య‌కర్త‌ల దృష్టి మాత్రం ఎన్టీఆర్ పై ప‌డింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే.. ఏపీలో ఇప్పుడు తెలుగుదేశంకు ఢోకా లేదు. అక్క‌డ అధికార పార్టీ వాళ్ల‌ది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా కాస్త ట్రై చేస్తే జ‌గ‌న్ ను కాద‌ని వ‌స్తుందేమో మ‌రి..? అదే తెలంగాణ‌లో మాత్రం ప‌రిస్థితి మ‌రోలా ఉంది. ఇక్క‌డ ఒక్క సీట్ కూడా వ‌స్తుందా రాదా అనేంత స్థాయికి దిగ‌జారిపోయింది టీడిపి. బ‌లంగా ఉంటార‌నుకున్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లిపోవ‌డంతో తెలంగాణ టిడిపి అనాధ అయిపోయింది. మ‌రోవైపు టిఆర్ఎస్ దూసుకుపోతుంది. ఈ విష‌యంపైనే ప్ర‌త్యేకంగా త‌న కార్య‌కర్త‌ల‌తో మీటింగ్ ఏర్పాటు చేసాడు చంద్ర‌బాబునాయుడు.

ఈ మీటింగ్ లో చంద్రబాబు ముందే పలువురు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేసినట్లు తెలుస్తుంది. ఇక్క‌డ త‌మ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నార‌నే వార్త‌లొస్తున్నాయంటూ చంద్ర‌బాబు ముందే వాళ్లు అరుపుల‌కు దిగ‌డంతో ఆయ‌న వారించారు. అస‌లు అలాంటి పిచ్చి ప‌ని తాను ఎప్ప‌టికీ చేయ‌న‌ని.. అస‌లు పార్టీని అలా విలీనం చేసే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని కార్య‌కర్త‌ల‌కు చెప్పార‌ని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ శాశ్వతంగా ఉంటుందని, ఇక్కడ జెండా పీకేయాలని కొందరు పన్నాగం పన్నుతున్నారని అదంత సులభం కాదన్నారు బాబు. ఇక పొత్తుల విషయంపై స్పష్టతనిస్తూ బీజేపీతో తెలంగాణలో పొత్తు లేదని.. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా త్వరలోనే ప్రకటిస్తానని అన్నాడు.
ఇదంతా ఇలా ఉంటే.. తెలంగాణ‌లో పార్టీకి భ‌విష్య‌త్తు ఉండాలంటే ఇక్క‌డ పార్టీ ప‌గ్గాలు ఎన్టీఆర్ కు ఇవ్వాల‌ని కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేసిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. చంద్ర‌బాబు ఎలాగూ ఏపీలో బిజీ కాబ‌ట్టి.. త‌మ‌తో 15 రోజుల‌కోసారైనా మాట్లాడ్డానికి ఓ నాయ‌కుడు కావాల‌ని.. అది ఎన్టీఆర్ అయితే ఇంకా హ్యాపీ అని కార్య‌క‌ర్తుల చెప్పిన‌ట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈయ‌న‌కు పార్టీ ప‌గ్గాలిస్తే క్యాడ‌ర్ లో కూడా కొత్త ఉత్సాహం వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు కార్య‌క‌ర్త‌లు. ఈ నినాదాలపై స్పందించిన చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కో లేక నారా లోకేష్ కో పగ్గాలు అప్పగించడం సరికాదని.. మీలో నుంచే ఓ బలమైన నాయకుడు రావాలని.. అతనికే పగ్గాలు అప్పగిస్తామని కరాఖండిగా ఓ మాట అనేసిన‌ట్లు తెలుస్తుంది. మొత్తానికి సినిమాలు చేసుకుంటూ హాయిగా ఉన్న ఎన్టీఆర్ ను మ‌ళ్లీ రాజ‌కీయాల వైపుగా తీసుకొస్తున్నారు.. ఏం చేస్తారో ఏమో మ‌రి ఈ బుడ్డోన్ని. 
 

More Related Stories