English   

క‌త్తిపై ప్రేమ చూపిస్తున్న ఎన్టీఆర్..

NTR

క‌త్తి అంటే ఇక్క‌డ క‌త్తి మ‌హేశ్ కాదండోయ్ బాబూ..! అస‌లే ఈ మ‌ధ్య ఎక్క‌డ విన్నా క‌త్తి మ‌హేశ్ పేరు బాగా వినిపిస్తుంది. ఇక్క‌డ ఎన్టీఆర్ కు క‌త్తికి ఏ సంబంధం లేదు. క‌త్తి అంటే క‌త్తే. నిజంగా కోసే క‌త్తే. ఇప్పుడు ఈ క‌త్తికే ప్రేమ చూపిస్తున్నాడు ఎన్టీఆర్. అదెలా అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈయ‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది.. హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది కూడా. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఏ జోన‌ర్ లో తెర‌కెక్కుతుందో అని చాలా రోజులుగా అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల్లోనూ చిన్న అనుమానం ఆస‌క్తి రెండూ ఉన్నాయి. దీనికి ఇప్పుడు స‌మాధానం దొరికేసింది. త్రివిక్ర‌మ్ సినిమా ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. అవును.. ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్యాక్ష‌న్ జోలికి వెళ్ల‌ని త్రివిక్ర‌మ్ ఎందుకో కానీ ఈ సారి అదే ఎంచుకున్నాడు. జ‌ల్సాలో విల‌న్ కారెక్ట‌ర్ ను ఫ్యాక్ష‌నిస్ట్ గా చూపించాడు మాట‌ల మాంత్రికుడు. ఈ సారి సీమ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో సీమ ప‌గ‌ల‌తో పాటు ప్రేమ‌లు కూడా ఉంటాయ‌ని తెలుస్తుంది. అస‌లు సినిమా ప్ర‌ధాన క‌థే ప్రేమ చుట్టూ తిరుగుతుంద‌ని తెలుస్తుంది. ల‌వ‌ర్ బాయ్ గా చాలా రోజుల త‌ర్వాత క‌నిపించ‌బోతున్నాడు ఎన్టీఆర్. పూజాహెగ్డే ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా న‌టిస్తుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 12న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మొత్తానికి చూడాలిక‌.. ఎన్టీఆర్ క‌త్తి ప్రేమ‌క‌థ ఎలా ఉండ‌బోతుందో..
 

More Related Stories