English   

హాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్..ఫ్యాన్స్ కు పండగే

Jr NTR
2021-02-23 11:50:37

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవకముందే ఎన్టీఆర్ మరో రెండు సినిమాలకు ఒకే చెప్పాడు. వాటిలో త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తుండగా...ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు "అయినా పోయి రావలె హస్తినకు" అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 

ఆర్ఆర్ఆర్  తరవాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఆ తరవాత ప్రశాంత్ నీల్ తో సినిమా ప్రారంభం కానుంది. ఇవి ఇలా ఉండగానే తమిళ డైరెక్టర్ అట్లీ, బుచ్చిబాబు లతో కూడా ఎన్టీఆర్ సినిమాలు చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా మరో వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ లో "అన్ బ్రేకబుల్, ది సిక్స్త్ సెన్స్, గ్లాస్" వంటి సినిమాను తెరకెక్కించిన మనోజ్ నైట్ శ్యామలన్ దర్శకత్వంలో ఓ సినిమా చెగానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.

More Related Stories