English   

సిక్స్ ప్యాక్ తో ఎన్టీఆర్..భీమ్ వీడియో వచ్చేస్తుందా

Jr NTR Komaram Bheem
2020-10-19 09:13:24

ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాకుండా అన్ని భాషల సినీ అభిమానుల దృష్టి మొత్తం దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్" పైనే ఉంది. ఈ సినిమా తెలుగులో అతిపెద్ద మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోంది. సినిమాలో రాంచరణ్ మరియు ఎన్టీఆర్ లు ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా...ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమురం బీమ్ స్థానంలో నటిస్తున్నాడు.  ఇప్పటికే సినిమాలో రాంచరణ్ నటిస్తున్న అల్లూరి కి సంబందించిన ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా ఆ వీడియోకు భారీగా క్రేజ్ వచ్చింది. రాంచరణ్ అభిమానులు ఆ వీడియో చూసి మురిసిపోయారు. 

అయితే మధ్యలో వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ టీజర్ కు బ్రేక్ పడింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టిన ఆర్ఆర్ఆర్ టీం ఎన్టీఆర్ కు సంబందించిన వీడియోను అక్టోబర్ 22 న విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో ఏ ఫోటో ఆర్ఆర్ఆర్ సెట్ లోదే అని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ఆ ఫోటో ఆర్ఆర్ఆర్ సెట్ లోది కాదు. ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబూ రత్నాని ఎన్టీఆర్ ను ఫోటో షూట్ చేసిన సందర్భంలోనిది.

More Related Stories