English   

ఎన్టీఆర్ వదిలేసిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్‌లే.. ఆ ఒక్కటి తప్ప..

jrntr
2020-05-21 07:37:52

19 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు 28 సినిమాలు చేసాడు జూనియర్. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ట్రిపుల్ ఆర్ 29వ సినిమా. దీని తర్వాత త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో సినిమాలు కన్ఫర్మ్ చేసాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ప్రతీ నటుడి కెరీర్ లో కూడా కొన్ని సినిమాలు వదులుకుంటాడు. కొందరు చేయాల్సిన సినిమాలను తాను చేస్తుంటాడు. అలాగే ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. ఇప్పటి వరకు ఈయన కెరీర్ లో చాలా సినిమాలు వదిలేసుకున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే జూనియర్ కాదన్న సినిమా సూపర్ హిట్ అవుతుందని సెంటిమెంట్ కూడా ఉంది ఇండస్ట్రీలో. నూటికి 99 శాతం అది నిజమైంది కూడా. జూనియర్ వద్దనుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.. రవితేజ లాంటి హీరోల దశ మార్చేసాయి. మాస్ రాజా కెరీర్ ను మార్చేసిన కిక్, భద్ర, కృష్ణ లాంటి సినిమాలు ఆయా దర్శకులు ముందుగా జూనియర్ కు చెప్పారు. అయితే వివిధ కారణాలతో ఈ సినిమాలను కాదనుకున్నాడు తారక్. అవి కాస్తా రవితేజ కెరీర్ కు మరింత గట్టి పునాది వేసాయి. ఇక అల్లు అర్జున్ కెరీర్ కు ఊపిరి పోసిన ఆర్య కథను ముందుగా సుకుమార్ నందమూరి చిన్నోడికే చెప్పాడు. దిల్ సినిమాకు వినాయక్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్న సుక్కు.. జూనియర్ కు లైన్ చెప్తే ఎందుకో కానీ నచ్చలేదు.

దాంతో బన్నీకి చెప్పి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అతనొక్కడే కథను కూడా ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాడు సురేందర్ రెడ్డి. కానీ అది కాదన్నాడు.. ఆ వెంటనే అశోక్ చేసాడు. ఆ తర్వాత కిక్ సినిమా కథను వద్దనుకుని ఊసరవెల్లి చేసాడు. వినాయక్ కూడా ఆది సినిమా చేసిన తర్వాత దిల్ కథను ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాడు. అయితే అప్పుడే కాలేజ్ లవ్ స్టోరీ చేసిన తాను మళ్లీ అలాంటి కథే వద్దనుకున్నాడు. అదే నితిన్ కెరీర్ కు వరంగా మారింది. ఆ మధ్య వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఊపిరి సినిమాలో కార్తి కారెక్టర్ కు ముందుగా ఎన్టీఆర్ ను తీసుకున్నారు. అయితే అందులో నాగార్జున కాళ్లు పట్టుకునే సన్నివేశాలు ఉండటంతో లేనిపోని తలనొప్పులు వస్తాయని వదిలేసాడు జూనియర్. మహేష్ బాబు కష్టాలు తీర్చేసిన శ్రీమంతుడు కథను ముందుగా జూనియర్ కు చెప్పాడు కొరటాల శివ. అప్పటికే ఆయనతో బృందావనం సినిమాకు పని చేసిన అనుభవం ఉండటంతో శ్రీమంతుడు కథ చెప్పాడు. కథ బాగున్నా కూడా అనివార్య కారణాలతో ఆలస్యం చేయడంతో అదే కథను మహేష్ బాబుకు చెప్పి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కొరటాల శివ. ఆ తర్వాత జనతా గ్యారేజ్ రూపంలో జూనియర్ ఎన్టీఆర్ కు కూడా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఈ దర్శకుడు. అనిల్ రావిపూడి తొలి సినిమా పటాస్ కథను కళ్యాణ్ రామ్ కు చెప్తే ఆయన తన తమ్ముడికి కథ బాగుంటుందని చెప్పాడు. కానీ అనిల్ మాత్రం ఇది మీతోనే చేస్తానంటూ పటాస్ చేసాడు. అదే సినిమా కానీ ఎన్టీఆర్ కు పడుంటే సినిమా రేంజ్ కూడా మారిపోయుండేది అంటారు అభిమానులు. చివరగా బ్రహ్మోత్సవం కథ ముందు జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాడు శ్రీకాంత్ అడ్డాల. కానీ అక్కడ మిస్ అయి మహేష్ బాబు బుక్ అయ్యాడు. ఆ ఒక్కటి తప్ప మ్యాగ్జిమమ్ జూనియర్ రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

More Related Stories