English   

కరోనా నుంచి కోలుకున్న ఎన్టీఆర్‌.. నెగిటివ్ అంటూ మెసేజ్

Jr NTR
2021-05-25 11:31:24

ఎన్టీఆర్ కరోనాను జయించారు. ఆయనకు కొవిడ్-19 నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని  ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  ‘కొవిడ్-19 ప‌రీక్ష‌లో నెగెటివ్ వ‌చ్చింద‌ని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. నేను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశించిన‌ ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. కొవిడ్ చాలా ప్ర‌మాద‌క‌రమైంది. కానీ, ఇదొక వ్యాధే కాబ‌ట్టి త‌గిన జాగ్ర‌త్త‌లు, పాజిటివ్ ఆలోచ‌న‌ల‌తో జ‌యించ‌వ‌చ్చు. ఈ పోరాటంలో గెలిచేందుకు ధైర్య‌మే అతి పెద్ద ఆయుధం. ఆందోళ‌న ప‌డ‌కండి. మాస్క్ ధ‌రించండి.. ఇంట్లోనే ఉండండి’ అని కోరారు. మే 10న క‌రోనా బారిన ప‌డ్డారు తార‌క్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’లో కొమరం భీమ్‌గా నటిస్తున్నారు ఎన్టీఆర్‌. ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటించనున్నారు.

More Related Stories