English   

ఎన్టీఆర్ మ‌ళ్లీ నాన్న అవ‌తున్నాడోచ్..

jr ntr

నందమూరి ఇంట మ‌రోసారి బాబో పాపో రాబోతున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ళ్లీ తండ్రి కాబోతున్నాడు. ఇన్నాళ్లూ ఇది సీక్రేట్ గానే ఉన్నా ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చేసింది ఈ వార్త‌. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఇప్పుడు ఆరు నెలల గర్బవతి. మే చివ‌ర్లోకెల్లా ఆమెకు తోమ్మిది నెలలు నిండుతాయి. అప్పుడే నంద‌మూరి ఇంటికి కొత్త రూపం రాబోతుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ కు ఓ అబ్బాయి ఉన్నాడు. పేరు అభ‌య్ రామ్. 2011లో ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని పెళ్లి చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు మళ్లీ బాబో, పాపో రాబోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీక్రేట్ గానే ఉన్న ఈ విష‌యం.. ఇప్పుడు ఎన్టీఆర్ స‌న్నిహితుల నుంచి బ‌య‌టికి వ‌చ్చింది. ఆయ‌న ఇంటికి అంతా వ‌చ్చి ప‌ల‌క‌రించి వెళ్తుంటే విష‌యం ఏంట‌ని ఆరా తీస్తే ఇది అని బ‌య‌ట ప‌డింది. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ స్వ‌యంగా అనౌన్స్ చేస్తారేమో చూడాలిక‌..! మ‌రోవైపు ఈయ‌న సినిమాల విష‌యంలోనూ చాలా కేర్ తో అడుగేస్తున్నాడు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయ‌న‌. త‌ర్వాత రాజ‌మౌళి సినిమా క‌మిట‌య్యాడు. ఈ రెండు సినిమాల‌తోనే వ‌చ్చే రెండేళ్లు గ‌డిపేయ‌నున్నాడు జూనియ‌ర్. మ‌రి చూడాలిక‌.. ఎన్టీఆర్ ఇంట మ‌రో వార‌సుడే వ‌స్తాడో లేదంటే వార‌సురాలే ఉద‌యిస్తుందో..?

More Related Stories