English   

ఎన్టీఆర్ కు బాలయ్య విలన్ పేరెందుకు పెట్టారు..?

ntr-balayya
2018-05-22 10:00:24

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ ఫస్ట్ లుక్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టైటిల్ కు సంబంధించి కొత్త డౌట్స్ వస్తున్నాయి. అవి కూడా బాలకృష్ణతో ముడిపడి ఉండటంతో అభిమానుల్లో కొంత అసహనం కనిపిస్తోంది. అన్నీ బానే ఉన్నా ఈ టైటిలే ఇబ్బంది పెడుతోంది అనేది వారి వాదన. ఇంతకీ ఈ టైటిల్ వల్ల వచ్చిన ఇబ్బందేంటో తెలుసా..?

అరవింద సమేత వీరరాఘవ అనే టైటిల్ ఫిక్స్ అయినా.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి పేరు వీర రాఘవరెడ్డి.. యస్.. ఇంట్లో వాళ్లు అతన్ని రాఘవ అంటార.. బయటి వాళ్లు వీరా అని పిలుస్తారట. అయితే అసలు పేరు మాత్రం వీరరాఘవరెడ్డి.. ఈ పేరు వింటే వెంటనే సమర సింహారెడ్డి గుర్తొస్తుంది కదూ.. యస్.. బాలకృష్ణ రోరింగ్ హిట్ సమర సింహారెడ్డిలో విలన్ పాత్ర పేరు వీర రాఘవరెడ్డే కదా.. ఒరేయ్ వీర రాఘవరెడ్డీ నీ ఊరొచ్చా.. నీ ఇంటికొచ్చా అంటూ ఆయన ఊగిపోతూ చెప్పిన డైలాగ్ కూడా ఇదే. అంటే ఆ విలన్ పేరు ఇప్పుడు యంగ్ టైగర్ కు పెట్టారన్నమాట. ఇప్పటికే బాలయ్య, ఎన్టీఆర్ సెపరేట్ అనేది అందరికీ తెలుసు. అలాంటిది బాలయ్య విలన్ పేరు ఎన్టీఆర్ పాత్రకు పెట్టడంతో అభిమానుల్లో కాస్త అసహనం కనిపిస్తోంది. నిజానికి ఈ పూర్తి పేరు టైటిల్ లోనే పెట్టాలనుకున్నారు. కానీ అదే ప్రాబ్లమ్ వస్తుందనే వీర రాఘవ వరకూ ఆపేశారంటున్నారు. 

ఇక హారిక హాసిని బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సునిల్ కమెడియన్ గా ఈ మూవీతో కమ్ బ్యాక్ అవుతున్నాడు. ఇక ఇతర ప్రధాన పాత్రలు ఎవరు చేస్తున్నారే విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు టీమ్. మ్యూజిక్ థమన్ అందిస్తున్నడు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ కూ విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. ఇక సినిమా ఎలా ఉంటుందో కానీ ఎన్టీఆర్ కు బాలయ్య విలన్ పేరు పెట్టడం మాత్రం అభిమానులకు మింగుడు పడటం లేదు. 

More Related Stories