English   

జూన్ ఫస్ట్ చాలా హాట్ గురూ..

june 1st movie release box office

జూన్ ఫస్ట్.. అంటే రేపు బాక్సాఫీస్ కు పెద్ద పరీక్షే. సమ్మర్ తర్వాత  వస్తోన్న సినిమాలు ఈ రోజు బాక్సాఫీస్ వద్ద లక్ చెక్ చేసుకోబోతున్నాయి. మూడు సినిమాలు హైలెట్ గా కనిపిస్తోన్నా ఎవరి సినిమాకు ఆడియన్స్ హై హై అంటారనేది మాత్రం ఫజిల్ లానే ఉంది. ఏమాటకామాట.. ఈ మూడు సినిమాల్లో డబ్బింగ్ సినిమా అభిమన్యుడుపైనే అంచనాలున్నాయనేది నిజం. కోలీవుడ్ యాక్షన్ స్టార్ విశాల్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరో, విలన్ గా నటించిన ఈ సినిమా ఆల్రెడీ తమిళ్ లో సూపర్ హిట్ అయింది. సమంత హీరోయిన్ కావడంతో ఇక్కడ మరో ప్లస్ పాయింట్. ఆధార్ కార్డ్ నేపథ్యంలో సాగే సైబర్ క్రైమ్స్ ఎలా ఉంటాయనే పాయింట్ చుట్టూ రియలిస్టిక్ కథాంశంగా వస్తోన్న అభిమన్యుడు నిజంగా మన ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటాడు అనుకోవచ్చు. 

ఇక గోవిందా గోవిందా తర్వాత నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషణ్ లో వస్తోన్న ఆఫీసర్ రేపే వస్తున్నాడు. అయితే ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ఆఫీసర్ కు కనిపించడం లేదు. ప్రస్తుతం వర్మ వరుస డిజాస్టర్స్ తో ఉన్నాడు. నాగ్ సినిమాలపై క్రేజ్ తగ్గి చాలా రోజులైంది. అయినా ఈ జంట సినిమా అంటే కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ఉండటం ఖాయం. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలు పెంచలేకపోయింది. కానీ వర్మ ఏదైనా మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. టెక్నికల్ గా అతనెప్పుడూ బ్రిలియంటే. దాంతో పాటు కథ ఏమాత్రం ఆట్టుకున్నా.. ఈవెనింగ్ కే ఈ మూవీకి క్రేజ్ వచ్చేస్తుంది. 

ప్రస్తుతం ఒక హిట్ కోసం చకోర పక్షిలా చూస్తోన్న హీరో రాజ్ తరుణ్. కుర్రాడు అరంగేట్రంలో అదరగొట్టినా.. తర్వాత ఢీలా పడ్డాడు. ఈ నేపథ్యంలో రేపు రాజుగాడుగా వస్తున్నాడు. తనకు తెలియకుండానే దొంగతనాలు చేసే వింత జబ్బు ఉన్న కుర్రాడిగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. ట్రైలర్ లోనే చాలా నవ్వులు పూయించారు. సంజనా అనే కొత్తమ్మాయి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మరో ఎస్సెట్ రాజేంద్ర ప్రసాద్. అతని టైమింగ్ ట్రైలర్ లోనే అదిరిపోయింది. అలాగే ఈ రాజ్ తరుణ్, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఈడోరకం ఆడోరకం కూడా బావుంది. వీరి కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటుంది. ఇక కంప్లీట్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోన్న ఈమూవీ ఏమాత్రం నవ్వులు పంచినా రాజుగాడు సేఫ్ అయిపోతాడు. 

ఇక ఈ మూడూ కాక శరభ అనే సినిమా కూడా రిలీజ్ అయ్యేలా ఉంది. కానీ ఆ సినిమా గురించి మాట్లాడుకున్నవాళ్లే లేరు. రావొచ్చు రాకపోవచ్చు. బట్.. రేపు మూడు సినిమాలతో బాక్సాఫీస్ కాస్త కళకళలాడుతుందనే చెప్పాలి. మరి  హాట్ వార్ లో టాప్ ఎవరో చూడాలి.  

More Related Stories