English   

అఖిల్ ను గిల్లిన ఎన్టీఆర్.. బాధపడుతున్న వర్మ

Junior NTR
2021-04-09 15:20:24

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే సోషల్ మీడియా తోనే ఎక్కువ కాలం గడిపేస్తూ ఉంటారు. సినిమాలు రాజకీయాలు సామాజిక అంశాలపై పై తన స్టైల్ లో కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆర్జీవి కి ఓ వీడియో దొరికింది. ఎప్పుడో జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో ఎన్టీఆర్ తన పక్కన కూర్చున్న అక్కినేని అఖిల్ తొడపై సరదాగా గిల్లుతున్నాడు. ఒక సారి గిల్లాగా అఖిల్ సిగ్గుపడుతూ పక్కకు జరిగాడు. దాంతో ఎన్టీఆర్ మరోసారి అలాగే గిల్లాడు. ఈ వీడియో అప్పట్లోనే వైరల్ అయ్యింది. 

అయితే తాజాగా వర్మ చేతికి ఈ వీడియో దొరికింది. ఇంకేముంది ఆర్జీవి ఈ వీడియోను పోస్ట్ చేసి తనదైన స్టైల్ లో కామెంట్లు చేసాడు. ఇక హీరోయిన్ ల భవిష్యత్ ఏంటి..? నేను చాలా భాధపడుతున్నా..? సో సాడ్." అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇక ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఆర్జీవి పై ఫైర్ అవుతున్నారు. మరి కొందరు నెటిజెన్ లు దొరక్క దొరక్క ఈ వీడియో ఆర్జీవి చేతికె దొరకాల అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా నువ్వు హీరోయిన్ లను పట్టుకుని స్టేజ్ పై డ్యాన్సులు చేయొచ్చు...ఫుల్ గా తాగి ముద్దులు పెట్టొచ్చు కానీ సరదాగా చేసిన దానిపై లేని పోనీ కామెంట్స్ చేస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు.

More Related Stories