English   

మహేష్  ఫ్యాన్స్ కి టార్గెట్ అయిన కేఏ పాల్ !

Mahesh-paul
2019-03-13 12:39:15

కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. క్రైస్తవ మత ప్రభోదకుదయిన ఈయన చేసే ప్రేయర్స్ కంటే కామెడీ లు ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు నిజంగానే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు శాంతి సందేశం ఇచ్చాడు కానీ ఆ తర్వాత రానురాను బెస్ట్ కమెడియన్ గా మారిపోయాడు కేయే పాల్. దీనికి ఈయన చేసిన పనులే కారణం, అనవసరంగా ఆయన చేసే కామెంట్స్ కామెడీగా ఉండడంతో అవే ఆయన్ని కమెడియన్ గా మార్చేశాయి. అయన  ఇప్పుడు నిజాలు చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. తాజాగా ఈయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ మహేష్ బాబు ప్రస్తావన తీసుకు వచ్చాడు. తనకు బయట ఉన్న ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయారని ఈ మధ్య గన్నవరం ఎయిర్ పోర్టులో దిగినప్పుడు దాదాపు 70 నుంచి 100 మంది వచ్చి తనతో సెల్ఫీలు తీసుకున్నారని చెప్పాడు. వాళ్ళ కారణంగా తన ఫ్లైట్ మిస్ అయ్యేదని చివరి నిమిషాల్లో విమానం ఎక్కేసానని అన్నాడు కెఏ పాల్. ఆ తర్వాత మళ్ళీ ఫ్లైట్లో కూడా చాలామంది తర్వాత సెల్ఫీలు తీసుకున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. తన ఫాలోయింగ్ చూసి తనకు కూడా ఆశ్చర్యం వేసిందని తాను నిజంగా మహేష్ బాబు అందంగా ఉంటే తన రేంజ్ మరోలా ఉండేది అంటున్నాడు ఈయన. అనవసరంగా మధ్యలో మహేష్ బాబు పేరు తీసి ఇరుక్కున్నాడు పాల్, ఆయన్ని ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఆయనతో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. మెడలో నిమ్మకాయలు ఎండుమిరపకాయలు వేసుకుంటే దిష్టిబొమ్మలా ఉంటావు నువ్వు మహేష్ బాబుతో పోల్చుకుంటావా అంటూ కేఏ పాల్ పై సెటైర్లు వేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.మరోవైపు కృష్ణ తనతో ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు మహేష్ బాబు చాలా చిన్న పిల్లోడని తన ప్రెస్ మీట్ లో చెప్పాడు పాల్. మొత్తానికి సినిమా వాళ్ళ పేర్లు వాడుకుంటూ తాను కూడా వార్తల్లో నిలుస్తున్నాడు కే ఏ పాల్.

More Related Stories