English   

రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఛాలెంజ్ ప్రొడ్యూస‌ర్ తో..

k s rama rao next with ram charan

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీగా ఉన్న స్టార్స్ లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఒక‌డు. వ‌రుస‌గా సినిమాలు క‌మిట్ అవుతూ.. వ‌చ్చేయేడాది స‌మ్మ‌ర్ వ‌ర‌కూ బిజీ డైరీ రాసుకున్న రామ్ చ‌ర‌ణ్ లేటెస్ట్ గా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిన‌ట్టు టాక్. ప్ర‌స్తుతం డిస్క‌ష‌న్స్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ క‌పై ఇప్ప‌టికే భారీ హైప్ వ‌చ్చింది. కార‌ణం మెగాస్టార్ చిరంజీవి..  చ‌ర‌ణ్ సినిమాకు ఇప్పుడు చిరంజీవి స‌పోర్ట్ అక్కర్లేద‌నేది నిజం. అయినా ఆ పేరు ఎందుకు వ‌చ్చిందంటే..చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయ‌బోయే నిర్మాత వ‌ల్ల‌. య‌స్.. మెగా పవ‌ర్ స్టార్ సినిమాను నిర్మించ‌బోయేది.. చిరంజీవిని మెగాస్టార్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె ఎస్ రామారావు. 

కెఎస్ రామారావు, చిరంజీవి కాంబినేష‌న్ లో చాలాపెద్ద విజ‌యాలున్నాయి. చిరంజీవికి మాస్ ఇమేజ్ తో పాటు క్లాస్ ఇమేజ్ నూ ఆపాదించిన ప్రొడ‌క్ష‌న్ హౌసెస్ లో కెఎస్ రామారావు క్రియేటివ్ క‌మర్షియ‌ల్ బ్యాన‌ర్ ది తిరుగులేని పాత్ర‌. త‌న త‌రం నిర్మాత‌లు ఎప్పుడో ఇంటికే ప‌రిమిత‌మైనా ఇంకా రామారావు సినిమాలు నిర్మిస్తూనే ఉన్నాడు. ప్ర‌స్తుతం సాయి ధ‌ర‌మ్ తేజ్ తో క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తేజ్ ఐల‌వ్వ్యూ సినిమాను నిర్మిస్తోన్న కెఎస్ రామారావు నెక్ట్స్ రామ్ చ‌ర‌ణ్ తోనూ సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌నే మాట‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ వ‌చ్చే యేడాది మొద‌లు కావొచ్చు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్‌.. బోయ‌పాటి సినిమా చేస్తున్నాడు. ఇది ద‌స‌రాకు విడుద‌ల‌వుతుంది. త‌ర్వాత ఎన్టీఆర్ తో క‌లిసి రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో భారీ మ‌ల్టీస్టారర్ చేస్తాడు. ఆ త‌ర్వాత కెఎస్ రామారావు బ్యాన‌ర్ లో సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ విష‌యంలో చిరంజీవి నుంచి కూడా ఇప్ప‌టికే రామారావుకు స్ప‌ష్ట‌మైన హామీ ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి చిరంజీవికి అభిలాష‌, ఛాలెంజ్, మ‌ర‌ణ మ్రుదందం, రాక్ష‌సుడు వంటి హిట్స్ ఇచ్చిన క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యార‌ర్  చ‌ర‌ణ్ తో ఎలాంటి సినిమా చేస్తుందో చూడాలి 

More Related Stories