English   

ట్రెండ్ అవుతున్న KA పాల్.. రామ్ గోపాల్ వర్మ సెటైర్లు..

RGV Touches KA Paul's Feet In Mumbai Hotel
2019-01-17 20:14:40

రాంగోపాల్ వర్మ మళ్లీ వార్తల్లో నిలిచాడు. ka పాల్ ను సెటైరికల్ వ్యాఖ్యలతో ట్విట్టర్లో పంచ్ వేసిన వర్మ.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. కొన్ని రోజుల కింద పాల్ పై సెటైర్ వేసాడు ఆర్ జి వి. పాల్ ఇలా చంద్రబాబు, జగన్ లాంటి చిన్నచిన్న లీడర్లపై పోటీ చేసే కంటే కూడా ఆ జీసస్ ను అడిగి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుని దానికి అధ్యక్షుడు అయిపోవచ్చు కదా అని ఆడుకున్నాడు వర్మ. దీనికి పాల్ కూడా స్పందించాడు. వర్మ తాను చేసిన తప్పు తెలుసుకొని ముంబై హోటల్లో తనను కలిసి కాళ్లు పట్టుకున్నాడు అంటూ ట్వీట్ చేశాడు. దీన్ని కూడా కామెడీ చేశాడు రాంగోపాల్ వర్మ. తాను కె.ఎ.పాల్ కాళ్ళు పట్టుకో లేదని.. ప్రభువా నేను పాల్ కాళ్లు పట్టుకోలేదు.. జస్ట్ అలా వెనక్కి లాగి వదిలితే కిందపడి తలకు తగిలి బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ మీరు ఫీల్ అవుతారని వదిలేశా అంటున్నాడు వర్మ. మొత్తానికి ఇప్పుడు కె.ఎ.పాల్ వర్మ మధ్య కామెడీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనికి పాల్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

More Related Stories