English   

కాలా.. కాస్త కష్ట‌మేన‌బ్బా..!

Kaala bad collectioins in tollywood

ర‌జినీకాంత్ ఉన్నాడులే.. ఎలా ఉన్నా ఆయ‌న చూసుకుంటాడు అనుకునే రోజులు పోయాయి ఇప్పుడు. ఆయ‌న ఉన్నా కూడా సినిమా కూడా బాగా ఉంటేనే కానీ ప్రేక్ష‌కులు థియేట‌ర్ కు రావ‌డం లేదు. లేదంటే టీవీల్లో వ‌చ్చిన‌పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఇదే జ‌రుగుతుంది కూడా. క‌బాలి కూడా త‌మిళ్ లో త‌ప్ప అన్నిచోట్లా ఫ్లాప్. అయినా కూడా ఇప్పుడు మ‌ళ్లీ ధైర్యంగా రంజిత్ ను న‌మ్మి మ‌రో ఆఫ‌ర్ ఇచ్చాడు ర‌జినీకాంత్. కాలా అంటూ మ‌రోసారి క‌బాలికి బిడ్డ లాంటి సినిమాను తీసుకొచ్చాడు రంజిత్. కాక‌పోతే ఈ సారి కాస్త బెట‌ర్ ఔట్ పుట్ ఇచ్చాడు కానీ హిట్ సినిమాను మాత్రం కాదు. ఈ సారి కూడా ర‌జినీకాంత్ కు తెలుగులో తిప్ప‌లు త‌ప్పేలా లేవు. ఇక విచిత్రం ఏంటంటే తొలిరోజే ఈ చిత్రానికి చాలా చోట్ల త‌క్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి. సాధార‌ణంగా ర‌జినీ సినిమాల‌కు వ‌చ్చే క‌లెక్ష‌న్లు మాత్రం కాలాకు క‌నిపించ‌లేదు. క‌బాలికి ఫ‌స్ట్ డే ఏకంగా 56 కోట్ల షేర్ వ‌చ్చింది. కానీ అందులో స‌గం కూడా కాలా తీసుకొచ్చేలా క‌నిపించ‌ట్లేదు. పైగా టాక్ కూడా తేడాగానే ఉంది. మ‌రిలాంటి ప‌రిస్థితుల్లో కాలా ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో చూడాలిక‌..! ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 155 కోట్ల‌కు చేసాడు నిర్మాత ధ‌నుష్. 

More Related Stories