English   

లింగా సేఫ్.. కాలా డ‌బుల్ డిజాస్ట‌ర్..!

kaala

మాకు ఈ ర‌జినీకాంత్ వ‌ద్దు.. పాత ర‌జినీకాంత్ కావాలి..! టాక్ తో ప‌నిలేకుండా రికార్డుల దుమ్ము రేగ్గొట్టే ర‌జినీకాంత్ కావాలి.. సినిమా ఎలా ఉన్నా తొలి మూడు రోజులు టికెట్స్ కోసం ఆలోచించాల‌న్నా ప్రేక్ష‌కులు భ‌య‌ప‌డే ర‌జినీకాంత్ కావాలి. ఇప్పుడు ఉన్న కాలా ర‌జినీకాంత్ మాకు వ‌ద్దంటూ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఎందుకంటే ఈ చిత్రం ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్ లెక్క వ‌చ్చింది ఇప్పుడు. మ‌రో నాలుగు రోజుల్లో అంటే జులై 27న ఈ చిత్రం అమేజాన్ లో ప్ర‌త్య‌క్షం కానుంది. దాంతో సినిమా ఎంత వ‌సూలు చేసిందో లెక్క బ‌య‌టికి వ‌చ్చింది. ఇది చూసిన త‌ర్వాత ఎవ‌రికైనా షాక్ త‌ప్ప‌దు. క‌నీసం అమ్మిన దాంట్లో స‌గం కూడా రాబ‌ట్ట‌లేక‌పోయాడు కాలా. 

అరె.. అస‌లు ర‌జినీకాంత్ సినిమా అంటే ఎలా ఉండాలి..? ఒక్క‌సారి క‌బాలినే తీసుకోండి.. ఈ చిత్రం కూడా ఫ్లాప్ టాక్ తోనే ఓపెన్ అయింది క‌దా.. కానీ వ‌సూళ్లు మాత్రం రికార్డులు తిర‌గ‌రాసాయి. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం అప్ప‌ట్లో 200 కోట్లు వ‌సూలు చేసింది. అందులో షేర్ 125 కోట్లు ఉన్నాయి. ఫుల్ ర‌న్ క‌లెక్ష‌న్స్ లో తెలుగు ఫ్లాప్ అయినా ఓవ‌రాల్ గా 280 కోట్లు వ‌సూలు చేసింది. త‌మిళ్ లో ఇది పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్. కానీ కాలా ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి ఆ ప‌ప్పులేవీ ఉడ‌క‌లేదు. అరవోళ్లు క‌బాలికి క్ష‌మించారు కానీ కాలాను మాత్రం బండ‌కేసి బాదారు. దాంతో లింగా కంటే పెద్ద డిజాస్ట‌ర్ గా కాలా మారిపోయింది. 

కాలాను 165 కోట్ల‌కు అమ్మారు. కానీ వ‌చ్చింది మాత్రం 75 కోట్లే. ఈ చిత్రం త‌మిళ‌నాట కూడా డిజాస్ట‌ర్ కావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. అక్క‌డ ర‌జినీ ఇమేజ్ తో ఆడేస్తుంద‌నుకున్నారంతా. కానీ అక్క‌డ కూడా ఈ చిత్రం నిల‌బ‌డ‌లేక‌పోవ‌డం కాస్త విడ్డూర‌మే. ఓవ‌రాల్ గా కాలా ర‌జినీ కెరీర్ లో మ‌రో డిజాస్ట‌ర్ గా నిలిచిపోయింది. తెలుగులో అయితే లింగా.. విక్ర‌మ‌సింహా.. క‌బాలి.. ఇప్పుడు కాలా వ‌ర‌స‌గా నాలుగో డిజాస్ట‌ర్. అందుకే అంటున్నారు ఇప్పుడు ప్రేక్ష‌కులు.. మాకు ఒక‌ప్పటి పాత ర‌జినీకాంత్ కావాలి. అడుగేస్తు రికార్డులు బద్ధ‌ల‌య్యే పాత ర‌జినీకాంత్ కావాలి అని..! మ‌రి చూడాలి.. ఆ ర‌జినీ ఎప్ప‌టికి బ‌య‌టికి వ‌స్తాడో మ‌ళ్లీ..! అస‌లు వ‌స్తాడో రాడో కూడా తెలియ‌దు. 

More Related Stories