English   

కాలా.. దుమ్మురేపుతున్నాడు

kaala box office collections

టాక్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ ను చేరుకుని ఎంటైర్ ట్రేడ్ ను ఆశ్చర్యపరిచాడు. నిజానికి కాలాకు డివైడ్ టాక్ వచ్చింది. అయినా ఆ టాక్ తో పనిలేకుండా పా రంజిత్ మ్యాజిక్ వర్కవుట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు యూఎస్ లో కూడా మూడు రోజుల్లోనే మిలియన్ మార్క్ ను చేరుకుని సంచలనం సృష్టించింది. విడుదలై అన్ని చోట్లా స్ట్రాంగ్ గా ఉన్న కాలా తెలుగులో మాత్రమే కాస్త వీక్ గా ఉన్నాడు. అటు కేరళలో కూడా దుమ్మురేపుతోందీ సినిమా. కాకపోతే కన్నడలో విడుదల కాకపోవడం కాస్త నిరాశపరిచింది. ఒకవేళ అక్కడా విడుదలై ఉంటే కలెక్షన్స్ లో మరిన్ని తేడాలు వచ్చేవి. 

ఆర్య, ద్రవిడ సబ్జెక్ట్ ను డిస్కస్ చేస్తూ పా రంజిత్ తెలివిగా చెప్పిన కథ కామన్ ఆడియన్ కు నచ్చకపోయినా.. చాలామంది మెచ్చుకుంటున్నారు. దీంతో పా. రంజిత్ కు రజినీకాంత్ మరోసారి దర్శకత్వం బాధ్యతలు ఎందుకిచ్చాడో.. అలాగే మూడో సినిమాకూ అవకాశం ఎందుకు ఇవ్వబోతున్నాడో అనే విషయం అర్థమైపోతుంది. మామూలుగానే ఇది పొలిటికల్ ఎజెండాతోనే వచ్చిన సినిమా. కాకపోతే ఆ ఇంపాక్ట్ బలంగా పడలేదు అనేది మాత్రం నిజం. 

More Related Stories