English   

 కాలా క్లైమాక్స్ లీక్ అయిందిగా..!

kaala-climax

తెలుగు సినిమాకు ఆల్రెడీ ఓ జ‌బ్బు ఉంది. అదే పైర‌సీ. సినిమా విడుద‌లైన రెండో రోజే నెట్ లో పైర‌సీ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. దాన్ని ఆప‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు నానా తంటాలు ప‌డుతున్నా.. పైర‌సీ భూతం మాత్రం అలాగే ఉంది. దీనితోనే త‌ల బొప్పి క‌డుతుంటే ఇప్పుడు మ‌రోటి త‌యార‌యింది ఇండ‌స్ట్రీకి. అదే లీకేజ్ య‌వ్వారం. సినిమా ఫుటేజ్, విజువ‌ల్స్ విడుద‌ల‌కు ముందే.. ఎడిటింగ్ రూమ్స్ లోంచి మాయ‌మ‌వుతున్నాయి. అవి నెట్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. ఐదేళ్ల కింద అత్తారింటికి దారేది సినిమా విడుద‌ల‌కు ముందే నెట్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. త‌ర్వాత బాహుబ‌లి విజువ‌ల్స్ కూడా ఇలాగే నెట్ లో లీక‌య్యాయి. ఈ రెండు సంద‌ర్భాల్లో వీడియో దొంగ‌త‌నం చేసింది ఆయా సినిమాల‌కు ప‌నిచేస్తున్న టీం కావ‌డ‌మే ఇక్క‌డ గ‌మ‌నార్హం. 

ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి పొర‌పాటే జ‌రిగింది. ఈ సారి ఏకంగా ర‌జినీకాంత్ సినిమానే వ‌ద‌ల్లేదు లీకేజ్ రాయుళ్లు. ఈయ‌న న‌టిస్తున్న కాలా చిత్ర క్లైమాక్స్ విజువ‌ల్స్ ను నెట్ లో పెట్టేసారు. దాంతో వెంట‌నే తేరుకున్న చిత్ర‌యూనిట్ పోలీసుల‌ను ఆశ్రయించింది. సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కూడా అదే వేగంతో స్పందించి నెట్ లోంచి డిలీట్ చేయించారు. ప‌క‌డ్భందీగా చేస్తోన్నా కూడా ఈ విజువ‌ల్స్ లీక‌వ్వ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ ప‌ని చేసింది కూడా ఇంటి దొంగ‌లేనా అనే కోణంలో ధ‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కార‌ణం ఏదైనా.. వాళ్ల స‌ర‌దా కోసం చేస్తోన్న చిన్న ప‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఎంతో న‌ష్టం తీసుకొస్తుంది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. ఈ లీకేజ్ య‌వ్వారం ఎప్పుడు ఎక్క‌డ ఆగుతుందో..? 

More Related Stories