English   

శంక‌ర్ ను దెబ్బ‌కొట్టిన కాలా

kaala effect on 2.0
2018-06-13 16:39:40

ఒక ఫ్లాప్ ఎన్నో మార్పులు చూపిస్తుంది అంటారు. అది నిజ‌మే అనడానికి ఇండ‌స్ట్రీలో ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. లేటెస్ట్ గా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కాలా మూవీ ఫ్లాప్ గా నిలిచింది. వ‌స్తున్న క‌లెక్ష‌న్స్ ను బ‌ట్టి ఇది ఫ్లాప్ అంటున్నారు కానీ.. నిజానికి కాలా బడ్జెట్ ర‌జినీ రెమ్యూనరేష‌న్న కాకుండా కేవ‌లం 25కోట్లు. ఆ ర‌కంగా చూస్తే ఇప్ప‌టికే కాలా 100కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేశాడు. అంటే ఇది పూర్తిగా ప్రాఫిట్ వెంచ‌ర్. కాక‌పోతే ర‌జినీ రేంజ్ హిట్ కాదు అనేది స‌ద‌రు ఫ్లాప్ అని చెప్పే వారి స‌మ‌స్య అయి ఉండొచ్చు. బ‌ట్ కొన్ని చోట్ల అమ్మిన‌దానికి, వ‌చ్చిన‌దానికి మ‌ధ్య పెద్ద వ్య‌త్యాసం ఉంద‌నేది కూడా నిజం. ఏదేమైనా కాలా ఎఫెక్ట్ ఇప్పుడు ర‌జినీ, శంక‌ర్ కాంబోలో వ‌స్తోన్న  2.0పై భారీగా ప‌డింది. 

శంక‌ర్, రజినీకాంత్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న 2.0పై మొద‌ట్లో భారీ అంచనాలుండేవి. కానీ రిలీజ్ డేట్ విష‌యంలో వ‌చ్చిన వాయిదాలు ఆ సినిమాపై ఇంట్రెస్ట్ త‌గ్గించాయి. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ నుంచి ఏకంగా ఏడెనిమిది నెల‌లు వెన‌క్కి వెళ్లింది 2.0. ఈ మ‌ధ్యే గ్రాఫిక్ వ‌ర్క్ పూర్తి చేసుకునే ద‌శ‌లో ఉన్న ఈమూవీపై బ‌య‌ర్స్ పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూపించ‌డం లేదు.. కార‌ణం.. ర‌జినీకాంత్ సినిమాలు వ‌రుస‌గా రెండూ వెంట‌వెంటనే పోవ‌డం. క‌బాలి అంచ‌నాల్ని అందుకోలేక‌పోయింది. కాలా.. ఆశించినంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీనివ‌ల్ల‌.. ఈ ఎఫెక్ట్ 2.0 బిజినెస్ పై భారీగా ప‌డింది. దీంతో ఇప్ప‌టికే హ‌య్యొస్ట్ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ మూవీకి ఆశించినంత రేట్ రాక‌పోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. సొంతంగా రిలీజ్ చేసుకున్నా అది తిరిగి వ‌స్తుంద‌నే గ్యారెంటీ లేదు. పైగా సినిమాకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ర‌క‌ర‌మైన హైప్ క్రియేట్ చేయ‌లేక‌పోయింది యూనిట్. మొత్తంగా అన్ని ప్రాబ్ల‌మ్స్ క‌లిపి.. క‌బాలి, కాలాగా మారి 2.0 నిర్మాత‌లను ఇబ్బంది పెడుతున్నాయ‌నేది కోలీవుడ్ టాక్. 

More Related Stories