English   

కాలా ఫ‌స్ట్ టాక్.. స్లో అండ్ స్ట‌డీ..!

kaala first talk
2018-06-07 09:40:16

కాలా ఫస్ట్ టాక్ వ‌చ్చేసింది.. ర‌జినీకాంత్ న‌టించిన కాలా సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. జూన్ 6 రాత్రే అన్నిచోట్లా ప్రీమియ‌ర్స్ కూడా ప‌డిపోయాయి. దానికి టాక్ కూడా పాజిటివ్ గానే వ‌చ్చింది. క‌బాలి మాదిరి కాకుండా ఈ సారి మాత్రం రంజిత్ మాయ చేసాడ‌ని.. ర‌జినీకాంత్ ఇమేజ్ ను స‌రిగ్గానే వాడుకున్నాడ‌ని చెబుతున్నారు ప్రేక్ష‌కులు. అభిమానులు అయితే పండ‌గ చేసుకుంటున్నారు. ఈ సారి ర‌జినీ విశ్వ‌రూపం చూపించాడ‌ని.. కొన్నేళ్లుగా ఈయ‌న‌కు స‌రైన సినిమా ప‌డ‌లేద‌ని ఇప్పుడు కాలాతో ఆ లోటు తీరిపోయింద‌ని న‌మ్ముతున్నారు వాళ్లు. ముఖ్యంగా కాలాలో ఇంట‌ర్వెల్ బ్లాక్ తో పాటు ఫ్లై ఓవ‌ర్ పై వ‌చ్చే ఫైట్ సీక్వెన్సులు నెక్ట్ లెవల్లో ఉన్నాయంటున్నారు అభిమానులు. సినిమా అయితే కాస్త స్లోగా అనిపించినా ఈ సారి మాత్రం బాగా గ‌ట్టిగానే కొట్టాడంటున్నారు ప్రేక్ష‌కులు. త‌మిళ్ లో అయితే సినిమా రికార్డులు తిరగ‌రాయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రి తెలుగులో ఏం జ‌రుగుతుందో చూడాలిక‌..!

More Related Stories